బిడ్డకు జన్మనిచ్చిన కేరళ ట్రాన్స్‌మన్‌పై ఎమ్మెల్యే షాకింగ్‌ వ్యాఖ్యలు

13 Feb, 2023 17:32 IST|Sakshi

దేశంలోనే తొలిసారిగా బిడ్డకు జన్మనిచ్చిన ట్రాన్స్‌మన్‌గా కేరళ ట్రాన్స్‌జెండర్‌ జంట నిలిచిన సంగతి తెలిసిందే. ఇది అరుదైన ఘటన అంటూ ఈ విషయం సర్వత్ర చర్చనీయాంశంగా నిలిచింది. ఐతే ఈ ఘటనపై కొడువల్లి ఎమ్మెల్యే, ఇండియన్‌ యూనియన్‌ ముస్లీం లీగ్‌ సీనియర్‌ నాయకుడు(ఐయూఎంఎల్‌) ఎంకే మునీర్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీన్ని అద్భుత ఘటనగా పేర్కొన్నవారంతా మూర్ఖులుగా అభివర్ణించారు.

అసలు ఆ జంటకు పాప పుట్టిన విషయాన్ని ఒక్కసారి ఆలోచిస్తే అసలు విషయం మనకే అవగతముతుందన్నారు. దీని వెనుక ఉన్న లాజిక్‌ని కూడా ఆయన విడమరిచి మరీ చెప్పారు. బిడ్డకు జన్మనిచ్చిన ట్రాన్స్‌మన్‌ నిజానికి ఒక స్త్రీ ఆమె పురుషునిలా మారుదామని వక్షోజాలను కూడా తొలగించుకుంది. అయితే ఆమె గర్భం దాల్చడంతో ఆమెను పురుషుడిగా మార్చడం విరమించుకున్నారు. అంటే గర్భం దాల్చిన వ్యక్తి స్త్రీ అని స్పష్టంగా అర్థమవుతుంది.

కానీ అందరూ దీన్ని ఒక అద్భుతంగా ఆహో ఓహో అంటూ ఏవేవో కబుర్లు చెబుతూ.. మూర్ఖుల్లా ప్రవర్తిస్తున్నారని కొడువల్లి ఎమ్మేల్యే ఎంకే మునీర్‌ అన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం విజ్డమ్‌ ఇస్లామిక​ కాన్ఫరెన్స్‌ నిర్వహించిన కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, ఫిబ్రవరి 8న ప్రసవించిన ట్రాన్స్‌మ్యాన్‌ జిహ్హద్‌ ఆ నవజాత శిశువు బర్త్‌ సర్టిఫికేట్‌లో తనను ఆ బిడ్డకు తండ్రిగా నమోదు చేయాలనిఆస్పత్రి వర్గాలను కోరిన నేపథ్యంలోనే ఆ ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలు చేశారు. 

(చదవండి:  ఆమెను చూసి ‘అయ్యో’ అనేసిన ప్రధాని మోదీ)

మరిన్ని వార్తలు