ఘోరం: గుండెపోటుతో డ్రైవర్‌ మృతి.. బస్సు బీభత్సంలో మరొకరు.. పలువురి పరిస్థితి విషమం

3 Dec, 2022 09:55 IST|Sakshi

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో ఘోరం జరిగింది. రన్నింగ్‌ బస్సులో డ్రైవర్‌ గుండె పోటుతో సీటులోనే కన్నుమూశాడు. ఆపై బస్సు పలు వాహనాలపైకి దూసుకెళ్లి బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.  

జబల్‌పూర్‌లో ఓ సిటీ బస్సు బీభత్సం సృష్టించింది. డ్రైవర్‌ హఠాత్తుగా గుండెపోటుతో డ్రైవర్‌ సీటులోనే కన్నుమూశాడు. దీంతో బస్సు అదుపు తప్పి పలు వాహనాలపైకి బస్సు దూసుకెళ్లింది. సిగ్నల్‌ ప్రాంతం కావడం, బస్సు వేగం తక్కువగా ఉండడం, సిగ్నల్‌ దగ్గర ఓ ఈ-రిక్షాను ఢీ కొట్టడంతో బస్సు ముందుకెళ్లి ఆగిపోయింది. 

బస్సు ప్రయాణికులతో పాటు ఈ-రిక్షా బోల్తా పడగా.. అందులోని ఇద్దరు చిన్నారులతో పాటు మొత్తం ఆరు మంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. బస్సు ఢీ కొట్టడంతో ఓ పెద్దాయన గాయపడగా.. చికిత్స పొందుతూ కన్నుమూశాడు. డ్రైవర్‌ హర్దేవ్‌ పటేల్‌ గత పదేళ్లుగా సిటీ మెట్రో బస్సు సర్వీసుకు పని చేస్తున్నారు. హఠాత్తుగా గుండెపోటు రావడంతో ఆయన స్టీరింగ్‌పైనే కుప్పకూలిపోయాడు.

VIDEO CREDITS: TIMES NOW

మరిన్ని వార్తలు