జిందాల్‌కు బెదిరింపు

25 Jan, 2023 06:34 IST|Sakshi

రాయ్‌గఢ్‌: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బిలాస్‌పూర్‌ సెంట్రల్‌ జైలు ఖైదీ ఒకడు పారిశ్రామిక వేత్త, కాంగ్రెస్‌ మాజీ ఎంపీ నవీన్‌ జిందాల్‌కు బెదిరింపు లేఖ రాశాడు. రూ.50 కోట్లను 48 గంటల్లోగా పంపాలని, లేకుంటే తీవ్ర పరిణామాలుంటాయని అందులో హెచ్చరించాడు.

ఈ మేరకు గత వారం రాయ్‌గఢ్‌లోని పత్రపాలి గ్రామంలో ఉన్న జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌ లిమిటెడ్‌(జేఎస్‌పీఎల్‌)కు లేఖ అందింది. దీనిపై కోట్రా రోడ్‌ పోలీసులు సెక్షన్లు 386, 506 కింద కేసు నమోదు చేశారు. సదరు బెదిరింపు లేఖను బిలాస్‌పూర్‌ జైలులోని ఖైదీ పోస్టు ద్వారా పంపినట్లు తేలిందని దర్యాప్తులు పోలీసులు చెప్పారు.

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు