సెంట్రల్‌ జైలులో​ ఖైదీల రాళ్ల దాడి.. ఆపై నిప్పు!

7 Nov, 2021 15:45 IST|Sakshi

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని జైఫతేఘర్ సెంట్రల్‌  జైలులో ఖైదీలు వీరంగం సృష్టించారు. జైలు సిబ్బందిపై రాళ్లలో దాడి చేసి, జైలుకు నిప్పు అంటించారు. హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న సందీప్‌ కుమార్‌ అనే వ్యక్తి మృతి చెందడంతో ఖైదీలు నిరసన తెలిపారు. ఈ నిరసన కాస్త ఉద్రిక్తంగా మారింది. జైలు సిబ్బంది సరైన వైద్యం అందించకపోవడం కారణంగానే సందీప్‌ కూమార్ మృతిచెందాడని పలువురు ఖైదీలు ఆరోపణలు చేసి దాడికి పాల్పడ్డారు.

ఖైదీలు ఇద్దరు డిప్యూటీ జైలర్లను జైలులోనే బంధించారు. దీంతో పోలీసులు ఖైదీల అల్లర్లును ఆపడానికి వారిపై భాష్ప వాయువు ప్రయోగించారు. అయినప్పటికీ అదుపులోకి రాకపోవటంతో అదనపు బలగాలను జైలులోకి మోహరించారు. దీంతో  జైలు ఉన్నతాధికారులు ఖైదీలును శాంతిపజేయడానికి చర్యలు తీసుకుంటున్నారు.   

మరిన్ని వార్తలు