జైల్లో నుంచి ఎమ్మెల్యేగా.. ప్రమాణం చేసిన అఖిల్‌ గొగోయ్‌

21 May, 2021 16:43 IST|Sakshi

గువాహటి: సీఏఏ చట్టం వ్యతిరేక ఉద్యమకారుడు, రైజోర్ దళ్ చీఫ్ అఖిల్ గొగోయ్  శుక్రవారం  ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మతో సహా నేడు 125 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. వారితో పాటు అఖిల్ గొగోయ్ కూడా నేడు ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు ఫలితంగా అసోం అసెంబ్లీ ఎన్నికల చరిత్రలోనే  జైలు నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించిన మెదటి వ్యక్తిగా అఖిల్  సరికొత్త  చరిత్ర సృష్టించాడు.

జైల్లో నుంచి శివ్‌సాగర్ నియోజకవర్గం నుంచి ఆయన పోటీచేసిన సంగతి తెలిసిందే. తన సమీప బీజేపీ అభ్యర్థి సురభి రాజ్‌కోన్వారిపై 11,875 ఓట్ల తేడాతో ఆయన గెలుపొందాడు. సీఏఏ వ్యతిరేక ఉద్యమం నేపథ్యంలో దేశద్రోహం, ఇత‌ర అభియోగాల కింద 2019 డిసెంబర్‌ లో గొగోయ్‌‌ను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. అస్సాం అసెంబ్లీలో శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి మే 11 న  ప్రత్యేక ఎన్‌ఐఏ కోర్టు అఖిల్ గొగోయ్‌కి అనుమతి ఇచ్చింది.

(చదవండి:Mamata Banerjee: సీఎం కోసం పదవి త్యాగం చేసిన ఎమ్మెల్యే)

>
మరిన్ని వార్తలు