మైనర్‌పై అత్యాచారం: 9 రోజుల్లో తీర్పు.. 20 ఏళ్ల శిక్ష

6 Oct, 2021 06:34 IST|Sakshi

జైపూర్‌: మైనర్‌పై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి రాజస్తాన్‌లోని ప్రత్యేక పోక్సో కోర్టు కేవలం 9 రోజుల్లో విచారణ పూర్తి చేసి శిక్ష విధించింది. 9 ఏళ్ల బాలికపై కమలేశ్‌ మీనా (25) సెప్టెంబర్‌ 26న అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే స్పందించిన పోలీసులు ఘటన తర్వాతి ఉదయమే నిందితున్ని అరెస్టు చేశారు.

అనంతరం కేవలం 18 గంటల్లోనే కేసు నమోదు చేసి, కోర్టులో చార్జిషీటు దాఖ లు చేశారు. చలాన్‌ నమోదైన అయిదు పని దినాల్లో జైపూర్‌ మెట్రోపాలిటన్‌ సిటీ పోక్సో 3వ నంబర్‌ కోర్ట్‌ తీర్పు ప్రకటించింది. దోషిగా తేలిన కమలేశ్‌కు రూ. 2 లక్షల జరిమానాతో పాటు 20 ఏళ్ల జైలు శిక్ష విధిం చింది. జరిగిన ఘటన తీవ్రమైనది కావడంతో కేసును సీరియస్‌గా తీసుకున్నట్లు జైపూర్‌ డిప్యూటీ కమిషనర్‌ హరేంద్ర కుమార్‌ చెప్పారు. 

మరిన్ని వార్తలు