మెట్రో రైల్‌ కోచ్‌లు అద్దెకు..

19 Mar, 2021 20:07 IST|Sakshi

జైపూర్‌: కరోనా వైరస్ కారణంగా దాదాపు అన్ని రంగాలు కుదేలయిపోయాయి. ఇందుకు అది ఇది అన్న మినహాయింపేమీ లేదు. దీంతో ఆర్థికంగా కోలుకునేందుకు ఆయా రంగాలు వినూత్న ఆఫర్లను తెరపైకి తెస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజస్థాన్‌లోని జైపూర్ మెట్రో రైల్‌ అధికారులు సైతం ఆర్ధికంగా బలోపేతం అయ్యేందుకు తమదైన శైలిలో సరికొత్త ప్రణాళికతో ముందుకొచ్చారు. తమ మెట్రో స్టేషన్లలో బ్యానర్లు, స్టాండ్లు, పందిళ్లు ఏర్పాటు చేసుకుని ప్రకటనలు వేసుకునేందుకు వారు అవకాశం కల్పించారు. 

తాజాగా బర్త్ డే, ఇతరత్రా వేడుకల కోసం మెట్రో రైల్‌ కోచ్‌లను అద్దెకు తీసుకోవచ్చని వారు ప్రకటించారు. గంటల ప్రకారం వీటిని అద్దెకు తీసుకోవచ్చని, అద్దెకు తీసుకొనే వారు గంటకు రూ. 5000 చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. నిర్ణీత సమయం మించితే, గంటకు అదనంగా రూ. 1000 ఛార్జీ వసూలు చేయడం జరుగుతుందని వెల్లడించారు. ఇందుకు సంబంధించి ఓ ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థతో జైపూర్‌ మెట్రో అధికారులు ఒప్పందం కుదుర్చుకున్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు