26/11 Mumbai Terror Attack: ముంబై ఉగ్రదాడులకు 14 ఏళ్లు.. అమరుల త్యాగాలకు నివాళులు

26 Nov, 2022 12:19 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: 26/11 ముుంబై ఉగ్రదాడులు జరిగి ఈరోజుతో 14 ఏళ్లు అవుతోంది. భారత దేశ చరిత్రలోనే చీకటి రోజుగా చెప్పే ఈ విషాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన భద్రతా సిబ్బంది, పౌరులకు నివాళులు అర్పించారు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్. వారి త్యాగాలను స్మరించుకున్నారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు.

ఉగ్రవాదం మానవాళికి ముప్పు. నేడు 26/11 ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారిని భారత్‌తో పాటు యావత్ ప్రపంచం స్మరించుకుంటోంది. ఈ ఘటనకు బాధ్యులను న్యాయస్థానం ముందు నిలబెట్టాలి. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రదాడుల్లో ప్రాణాలు కల్పోయిన వారికి భారత్ సంఘీభావం తెలుపుతోంది. అని జైశంకర్ ట్వీట్ చేశారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ముంబై ఉగ్రదాడుల్లో మరణించిన వారికి సంతాపం తెలిపారు. ఆ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన భద్రతా సిబ్బందికి దేశం ఎప్పుడూ రుణపడి ఉంటుందన్నారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు.

14 ఏళ్ల క్రితం 2008లో ఇదే రోజున లష్కరే తోయిబాకు చెందిన 10 మంది ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి సముద్రమార్గం ద్వారా ముంబై వచ్చి ప్రముఖ హోటల్లో చొరబడ్డారు. కన్పించిన వారిపై కాల్పులకు తెగబడి మారణహోమం సృష్టించారు. ఈ ఘటనలో18 మంది భద్రతా సిబ్బంది సహా  మొత్తం 166 మంది ప్రాణాలు కోల్పోయారు.
చదవండి: మహిళలపై రాందేవ్ బాబా వివాదాస్పద వ్యాఖ్యలు..

మరిన్ని వార్తలు