జవాన్లకు ఆ పదం ఉపయోగించకూడదు! రాహల్‌పై విదేశాంగ మంత్రి ఫైర్‌

19 Dec, 2022 18:11 IST|Sakshi

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ భారత జవాన్లపై చేసిన వ్యాఖ్యలపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మన జవాన్లకు పిటై అనే పదాన్ని ఉపయోగించకూడదంటూ రాహుల్‌పై విరుచుకుపడ్డారు. "వారంతా అరుణాచల్‌ప్రదేశ్‌లో యాంగ్సేలో సుమారు 13 వేల అడుగుల ఎత్తులో నిలబడి పహారా కాస్తున్నారని అన్నారు. అలాంటి వారిని మనం  గౌరవించాలి.

వారి పట్ల అలాంటి పదాలను ఉపయోగించడం సరికాదు". అని జైశంకర్‌ లోక్‌సభలో అన్నారు. ఈ మేరకు విదేశాంగమంత్రి  జై శంకర్‌ సోమవారం లోక్‌సభను ఉద్దేశించి మాట్లాడుతూ.. మనం చైనా పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తే.. భారత సైన్యాన్ని సరిహద్దులకు ఎవరూ పంపారు. ఈ ఘర్షణలను తలెత్తకుండా ఉండేలా చైనాపై ఎందుకు ఒత్తిడి చేస్తున్నాం. ఇరు దేశాల సంబంధాలు మాములుగా లేవని బహిరంగంగా ఎందుకు చెబుతున్నాం అని గట్టిగా ప్రశ్నించారు. రాజకీయంగా విభేదాలు వచ్చినా, విమర్శలు వచ్చినా మాకెలాంటి ఇబ్బంది లేదని తెగేసి చెప్పారు. ఈ మేరకు విదేశాంగ మంత్రి జైశంకర్‌ అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్‌ సెక్టార్‌లో భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణల నేపథ్యంలో రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు.

ఇదిలా ఉండగా కాంగ్రెస్‌ నేత రాహుల్‌ రాజస్తాన్‌లోని జైపూర్‌లో భారత్‌ జోడో యాత్ర సందర్భంగా విలేకరుల సమావేశాంలో భారత్‌  చైనా ఘర్షణలు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజింగ్‌ యుద్ధానికి రెడీ అవుతుంటే మోదీ పాలన నిద్రపోతుందంటూ ఎద్దేవా చేశారు. మన భూమిని చైనా లాక్కుందని, చైనా సైనికులు భారత ఆర్మీ సిబ్బందిని కొడుతున్నారంటూ వ్యాఖ్యలు చూశారు. దీంతో బీజేపీ నేతలు ఆయన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడమే గాక ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్‌ చేశారు.

(చదవండి: షాకింగ్‌ ఘటన: దొంగతనం చేశాడని..‍కదులుతున్న రైలు నుంచి తోసేసి..)

మరిన్ని వార్తలు