ముఫ్తీ పాస్‌పోర్ట్‌పై ఆదేశాలివ్వలేం

30 Mar, 2021 05:42 IST|Sakshi

జమ్మూకశ్మీర్‌ హైకోర్టు వ్యాఖ్య

శ్రీనగర్‌: తనకు పాస్‌పోర్ట్‌ను జారీ చేయాలని అధికారులను ఆదేశించా లన్న జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ చీఫ్‌ మెహబూబా ముఫ్తీ విజ్ఞప్తిని జమ్మూకశ్మీర్‌ హైకోర్టు సోమవారం తోసిపుచ్చింది. మెహబూబా ముఫ్తీకి పాస్‌పోరŠుట్ట జారీ చేయకూడదని పోలీస్‌ వెరిఫికేషన్‌ నివేదిక సిఫారసు చేసినందువల్ల పాస్‌పోర్ట్‌ అధికారులు ఆ నిర్ణయం తీసుకున్నారని న్యాయమూర్తి జస్టిస్‌ అలీ మొహమ్మద్‌ మాగ్రే పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పాస్‌పోర్ట్‌ను జారీ చేయాలని తాను ఆదేశించలేనని స్పష్టం చేశారు.

ఈ విషయంలో కోర్టు జోక్యం చేసు కునేందుకు ఎలాంటి కారణాలు కనిపించడం లేద న్నారు. ‘పోలీస్‌ వెరిఫికేషన్‌ నివేదిక వ్యతిరేకం గా వచ్చినందున మీకు పాస్‌పోర్ట్‌ జారీ చేయలేమ’ని రీజనల్‌ పాస్‌పోర్ట్‌ అధికారి మార్చి 26న మెహ బూబా ముఫ్తీకి లేఖ రాశారు. దీనిపై ముఫ్తీ స్పం దిస్తూ.. ‘కశ్మీర్లో నెలకొందని చెబుతున్న సాధారణ స్థితికి ఇదే ఉదాహరణ’ అని వ్యాఖ్యానించారు. ‘నాకు పాస్‌పోర్ట్‌ జారీ చేయడం భారతదేశ భద్ర తకు ప్రమాదకరమని సీఐడీ నివేదిక ఇచ్చిందని చెబుతున్నారు. మాజీ ముఖ్యమంత్రికి పాస్‌పోర్ట్‌ ఉండటం దేశ సార్వభౌమత్వానికి భంగకరమట’ అని ఆమె ట్వీట్‌ చేశారు.

మరిన్ని వార్తలు