రాజకీయాలు ఇక చాలు, గుడ్‌ బై చెప్పిన షా

10 Aug, 2020 22:17 IST|Sakshi

క‌శ్మీర్‌: ఐఏఎస్ ప‌ద‌వికి రాజీనామా చేసి రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించిన షా ఫైజ‌ల్ నేడు రాజ‌కీయాల‌కు గుడ్‌బై చెప్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. సుమారు 16 నెల‌ల త‌ర్వాత ఆయ‌న రాజ‌కీయాల నుంచి నిష్క్ర‌మించారు. సోమ‌వారం జ‌మ్ము క‌శ్మీర్ పీపుల్స్ మూమెంట్స్ పార్టీ(జేకేపీఎమ్‌) అధ్య‌క్షుడిగా త‌ప్పుకున్న‌ట్లు వెల్ల‌డించిన ఆయ‌న‌ మ‌ళ్లీ త‌న ఉద్యోగంలోకి చేర‌నున్న‌ట్లు తెలుస్తోంది. కాగా షా ఫైజ‌ల్ 2010 సివిల్ స‌ర్వీస్ ప‌రీక్ష‌లో మంచి ర్యాంక్ సాధించ‌డంతో జ‌మ్ము క‌శ్మీర్ ప్ర‌భుత్వంలో ఐఏఎస్‌గా త‌న సేవ‌లందించారు. అయితే ఆయ‌న 2019 జ‌న‌వరిలో త‌న ఉద్యోగానికి రాజీనామా చేసి రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. అలా గ‌తేడాది మార్చి 21న  జ‌మ్ము క‌శ్మీర్ పీపుల్స్ మూమెంట్స్ పార్టీ స్థాపించారు.‌ జ‌మ్ము క‌శ్మీర్‌కు ప్ర‌త్యేక ప్రతిప‌త్తిని  క‌ల్పించే ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు స‌మ‌యంలో క‌శ్మీర్‌లోని అనేక‌మంది నేత‌ల‌తోపాటు షాను కూడా ప్ర‌జా భ‌ద్ర‌త చ‌ట్టం కింద నిర్బంధించారు. అనంత‌రం ఈ ఏడాది జూలైలో ఆయ‌న‌ను విడుద‌ల చేశారు. (కశ్మీర్‌ ఓ నివురుగప్పిన నిప్పు)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా