జయలలిత మరణం...శశికళను విచారణకు ఆదేశించాలన్న కమిషన్‌

18 Oct, 2022 14:39 IST|Sakshi

చెన్నై: తమిళనాడు దివగంత మాజీ ముఖ్యమంత్రి జయలలిత డిసెంబర్‌ 5, 2016న మృతి చెందిన సంగతి తెలిసిందే. ఐతే ఆమె మృతిపై పలు అనుమానాలు ఉన్నాయంటూ ఆర్మగస్వామి కమిషన్‌ని ఏర్పాటు చేయడం, ఐదేళ్ల తదనంతరం కమిషన్‌ 600 పేజీల నివేదికను స్టాలిన్‌కి సమర్పిచడం జరిగింది. ఐతే  ఆ నివేదిక తోపాటు అదనంగా సమర్పించిన 200 పేజీల్లో కొన్ని కీలక విషయాలను వెల్లడించిన సంగతి కూడా తెలిసిందే.

ఐతే ప్రస్తుతం ఆ కమిషన్‌ తన ముగింపు వ్యాఖ్యలలో జయలలిత నెచ్చలి, స్నేహితురాలు శశికళను దోషిగా పేర్కొంటూ విచారణకు ఆదేశించాలని పేర్కొంది. ఇందులో డాక్టర్‌ శివకుమార్‌(జయలలిత వ్యక్తిగత వైద్యుడు, శశికళ బంధువు), మాజీ ఆరోగ్య కార్యదర్శి రాధకృష్ణన్‌ , మాజీ ఆరోగ్య మంత్రి సి విజయ భాస్కర్‌లను కూడా దోషులుగా చేరుస్తూ దర్యాప్తుకు అభ్యర్థించింది. అంతేగాదు కమిషన్‌ వివిధ కోణాలను పరిగణలోనికి తీసుకుంటే వారందర్నీ దోషులుగా గుర్తించి దర్యాప్తు చేస్తేగాని ఒక నిర్ధారణకు రావడం సాధ్యం కాదని స్పష్టం చేసింది.

పైగా జయలలిత మరణాన్ని అధికారికంగా ప్రకటించడాన్ని కూడా తప్పుపట్టింది కమిషన్‌. అలాగే జయలలిత డిసెంబర్‌ 4, 2016న మధ్యాహ్నాం 3.50 నిమిషాలకు గుండెపోటుకు గురైన తర్వాత సీపీఆర్‌, స్టెర్నోటమీ వంటి ప్రయత్నాలు ఫలించలేదు. అయితే నిందితులు దీన్నీ సాకుగా చూపిస్తూ అధికారికంగా ప్రకటించడానికి జాప్యం చేసినట్లు చెబుతున్నారని కమిషన్‌ ఆరోపిస్తోంది. ఆమె చనిపోయింది డిసెంబర్‌ 4, 2016 అయితే ఆస్పత్రి వర్గాలు డిసెంబర్‌ 5, 2016గా ప్రకటించడాన్ని తప్పుపట‍్టింది.

అలాగే జస్టిస్ అరుణ జగదీశన్ కమీషన్ ఆఫ్ ఎంక్వైరీ 2018లో రాష్రంలోని తూత్తుకూడిలో జరిగిన పోలీస్‌ కాల్పుల ఘటనలో పోలీసుల తీరుని తప్పుపట్టింది. ఈ మేరకు స్టాలిన్‌ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం, 2018 తూత్తుకుడి ఘటన సంబంధించిన విచారణ నివేదికలను మంగళవారం అసెంబ్లీకి సమర్పించింది.  

(చదవండి: : ఐదేళ్లకు.. ‘అమ్మ’ మరణంపై కమిషన్‌ విచారణ పూర్తి

మరిన్ని వార్తలు