నేలకొరిగిన మరో ఇద్దరు జవాన్లు

17 Oct, 2021 05:07 IST|Sakshi

జమ్మూ కశ్మీర్‌ అటవీ ప్రాంతంలో కొనసాగుతున్న గాలింపు

ఎదురుకాల్పుల్లో లష్కరే కమాండర్‌ సహా ఇద్దరు ఉగ్రవాదులు హతం

ఇద్దరు స్థానికేతరులను కాల్చి చంపిన ముష్కరులు

జమ్మూ: జమ్మూకశ్మీర్‌లోని రాజౌరి, పూంచ్‌ జిల్లాల్లోని అటవీ ప్రాంతంలో వరుసగా ఆరు రోజులుగా కొనసాగుతున్న గాలింపులో జూనియర్‌ కమిషన్డ్‌ అధికారి(జేసీవో) సహా ఇద్దరు జవాన్లు నేలకొరిగారు. దీంతో సోమవారం నుంచి కొనసాగుతున్న ఎదురుకాల్పుల్లో ఇద్దరు జేసీవోలు సహా మొత్తం 9 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయినట్లయింది. గురువారం నార్‌ఖాస్‌ ప్రాంతంలో ఉగ్రమూకలతో ఎదురుకాల్పులు జరిగిన ప్రాంతంలోనే తాజాగా జేసీవో అజయ్‌ సింగ్, జవాన్‌ హరేంద్ర సింగ్‌ మృతదేహాలు దొరికాయని అధికారులు తెలిపారు.

పర్వతమయమైన దట్టమైన అటవీప్రాంతంలో గాలింపు కష్టసాధ్యంగా, ప్రమాదకరంగామారిందన్నారు. మెంధార్‌ నుంచి థానామండి వరకు మొత్తం అటవీ ప్రాంతాన్ని పారా మిలటరీ కమాండోలు, హెలికాప్టర్లతో జల్లెడపడుతున్నామన్నారు. ఇలా ఉండగా, బిహార్‌లోని బాంకా ప్రాంతం నుంచి బతుకుదెరువు కోసం వలసవచి్చన అర్వింద్‌కుమార్‌ షా(30)ను శ్రీనగర్‌లోని ఈద్గా ప్రాంతంలో, యూపీ నుంచి వచ్చిన సాగిర్‌ అహ్మద్‌ అనే కార్పెంటర్‌ను పుల్వామాలో శనివారం ఉగ్రవాదులు కాల్చి చంపారని అధికారులు వెల్లడించారు.

లష్కరే కమాండర్‌ హతం
జమ్మూకశీ్మర్‌లోని పుల్వామా జిల్లా పంపోరే ప్రాంతంలో శనివారం భద్రతాబలగాలతో జరిగిన ఎదురు కాల్పుల్లో లష్కరే తోయిబా కమాండర్‌ ఉమర్‌ ముస్తాక్‌ ఖాన్‌దేతోపాటు మరో గుర్తు తెలియని ఉగ్రవాది హతమయ్యాడు. పలు నేర ఘటనలతోపాటు ఈ ఏడాది జరిగిన ఇద్దరు కానిస్టేబుళ్ల హత్యతో ఖాన్‌దేకు సంబంధముందని అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు