ఒకవేళ ఓడితే.. కారణాలు ఇవే!

10 Nov, 2020 13:25 IST|Sakshi

జేడీయూ సీనియర్‌ నేత త్యాగి

పట్నా‌: బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తొలుత వెనుకబడిన ఎన్‌డీఏ కూటమి.. ప్రస్తుతం అధిక స్థానాల్లో ఆదిక్యంలో కొనసాగుతోంది. అయితే, కౌంటింగ్‌ ప్రారంభమైన రెండు గంటల వరకు కాంగ్రెస్‌-ఆర్జేడీ కూటమి మహాఘట్‌ బంధన్‌ ఎక్కువ స్థానాల్లో లీడింగ్‌లో ఉండటం.. ఎగ్జిట్‌ పోల్స్‌ కూడా వారికే జైకొట్టడంతో జేడీయూ నేతలు ఆందోళనకు గురయ్యారు. ఒకవేళ నితీష్‌ తిరిగి అధికారంలోకి రాకపోతే.. దానికి ప్రధాన కారణం కోవిడ్‌ పరిస్థితులేనని జేడీయూ సీనియర్‌ నేత కేసీ త్యాగి వ్యాఖ్యానించారు. 

ప్రజల తీర్పు ఎలా ఉన్నా స్వాగతిస్తాం. నితీష్‌ ప్రభుత్వం చేసిన అభివృద్ది పనులను కాదని ప్రజలు మమ్మల్ని తిరస్కరిస్తే.. బిహార్‌ వెనుకబడిందనేది నిజమని ఒప్పుకున్నట్టే’అని త్యాగి పేర్కొన్నారు. వలసలు, వరదలు, కరోనా ఇలా వరుస సంక్షోభాలు నితీష్‌ ప్రభుత్వాన్ని దెబ్బతీశాయని అన్నారు. ఎన్నికల ముందు ఎన్డీయే కూటమి నుంచి వైదొలిగి సొంతంగా పోటీచేసిన ఎల్‌జేపీక చిరాగ్‌ పాశ్వాన్‌ తమకు నష్టం కలిగించే అవకాశాలున్నాయని అభిప్రాయపడ్డారు.    (బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: లైవ్‌ అప్‌డేట్స్‌)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు