జార్ఖండ్‌లో ఆరుగురికి మిక్స్‌డ్‌ వ్యాక్సిన్‌

24 Jun, 2021 04:33 IST|Sakshi

పాలాము: జార్ఖండ్‌లోని పాలాము జిల్లాలో ఆరుగురికి అధికారులు పొరపాటున రెండు వేర్వేరు కంపెనీల కరోనా టీకాలు ఇచ్చారు. ఈ ఆరుగురు మొదటి డోసు కోవాగ్జిన్‌ తీసుకోగా, బుధవారం రెండో డోసు మాత్రం అధికారులు కోవిషీల్డ్‌ వేశారు. మిక్స్‌డ్‌ వ్యాక్సిన్‌ వల్ల ప్రస్తుతం వారిలో ఎలాంటి దుష్ప్రభావాలు కనిపించడం లేదని, ఆరోగ్యంగానే ఉన్నారని జిల్లా చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ అనిల్‌కుమార్‌ సింగ్‌ చెప్పారు.

రెండో డోసు కోసం హరిహరగంజ్‌లోని కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌కు వెళ్లగా, అక్కడి సిబ్బంది పొరపాటున కోవిషీల్డ్‌ ఇచ్చారని తెలిపారు. ఈ విషయం తెలియగానే హెల్త్‌ సెంటర్‌లో స్వల్ప ఉద్రిక్తత నెలకొందన్నారు. పోలీసులు రంగంలోకి దిగి, పరిస్థితిని చక్కదిద్దారని వెల్లడించారు. ఆరుగురిని మరో 24 గంటలపాటు పరిశీలనలో ఉంచుతామన్నారు. 

మరిన్ని వార్తలు