జడ్జి హత్య కేసు సీబీఐకి

1 Aug, 2021 04:25 IST|Sakshi

రాంచీ: ధన్‌బాద్‌ డిస్ట్రిక్‌ అండ్‌ సెషన్స్‌ జడ్జి ఉత్తమ్‌ ఆనంద్‌ను దుండగులు సెవెన్‌ సీటర్‌ ఆటోతో ఢీకొట్టి చంపిన కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి అప్పగించాలని జార్ఖండ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ ఈ కేసు దర్యాప్తును సీబీఐ చేపట్టాలని శనివారం సిఫారసు చేశారు. జూలై 28న మార్నింగ్‌ వాక్‌కు వెళ్లిన 50 ఏళ్ల ఉత్తమ్‌ ఆనంద్‌ను ఉద్దేశపూర్వకంగా వెనకనుంచి ఆటోతో ఢీకొట్టిన వీడియో వైరల్‌గా మారి దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన విషయం
తెలిసిందే.  

మరిన్ని వార్తలు