భారత్‌ బంద్‌ ఎఫెక్ట్‌: విద్యా సంస్థలు మూసివేత, పరీక్షలు రద్దు

20 Jun, 2022 08:04 IST|Sakshi

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నిపథ్‌ పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే నేడు(సోమవారం) దేశవ్యాప్తంగా భారత్‌ బంద్‌ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర సంస్థలు, రైల్వే స్టేషన్ల వద్ద రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, గవర్నమెంట్ రైల్వే పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. 

ఇదిలా ఉండగా.. అగ్నిపథ్ పథకానికి నిరసనగా ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ (AISF) జార్ఖండ్ బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ క‍్రమంలో జార్ఖండ్‌ ప్రభుత్వం కీలక నిర‍్ణయం తీసుకుంది. సోమవారం జార్ఖండ్‌లోని అన్ని పాఠశాలలు మూసివేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న 9, 11 తరగతుల పరీక్షలను కూడా వాయిదా వేసినట్లు అధికారులు ప్రకటించారు. 

ఈ సందర్బంగా పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగం కార్యదర్శి రాజేష్ కుమార్ శర్మ మీడియాతో మాట్లాడుతూ.. కొన్ని సంస్థలు పిలుపునిచ్చిన బంద్ దృష్ట్యా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు సోమవారం మూసివేయాలని నిర్ణయించాము. పాఠశాల విద్యార్థులకు, ముఖ్యంగా బస్సులో ప్రయాణించే వారికి ఎలాంటి ఇబ్బందులు తల్తెతకుండా ఉండేందుకు తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. 

మరోవైపు.. అ‍గ్నిపథ్‌కు వ్యతిరేకంగా బీహార్‌లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న కారణంగా 20జిల్లాల్లో ఇంటర్నెట్‌ సర్వీసులను నిలిపివేశారు. పంజాబ్‌లో కూడా శాంతి భద్రతలు అదుపు తప్పకుండా పోలీసుల అలర్ట్ ప్రకటించారు. యూపీలోనూ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. జైపూర్‌, నోయిడాలో పోలీసులు 144 సెక్షన్‌ విధించారు.

ఇది కూడా చదవండి: ఎమ్మెల్యే లవ్‌ ఎఫైర్‌.. సెక్స్‌ రాకెట్‌ బట్టబయలు

మరిన్ని వార్తలు