జిప్మర్‌లో హిందీ రగడ

9 May, 2022 06:22 IST|Sakshi

సాక్షి, చెన్నై: కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలోని జిప్మర్‌ (జవహర్‌లాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్, రీసెర్చి)లో పాలనా వ్యవహారాలన్నీ హిందీలోనే జరగాలన్న ఆదేశాలు కలకలం రేపుతున్నాయి. తమిళనాడుతో పాటు పుదుచ్చేరిలోనూ హిందీ, సంస్కృత భాషలను ఆది నుంచి వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జిప్మర్‌ ఇచ్చిన హిందీ ఉత్తర్వులపై తమిళాభిమానుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. బలవంతంగా హిందీని రుద్దాలన్న కేంద్ర ప్రభుత్వ యత్నాలను అడ్డుకుంటామని డీఎంకే ఎంపీ కనిమొళి హెచ్చరించారు. పుదుచ్చేరిలో బీజేపీ– ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్న విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు