పవర్‌గ్రిడ్‌, ఎస్‌బీఐలో ఉద్యోగ అవకాశాలు

17 Jun, 2021 19:45 IST|Sakshi

భారత ప్రభుత్వ రంగానికి చెందిన పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌.. ఏపీ, తెలంగాణ, కర్ణాటక పరిధిలోని సదరన్‌ రీజియన్‌ ట్రాన్స్‌మిషన్‌ సిస్టమ్‌.. డిప్లొమా ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

► మొత్తం పోస్టుల సంఖ్య: 35;
సబ్జెక్టులు: ఎలక్ట్రికల్, సివిల్‌. 
డిప్లొమా ట్రెయినీ(ఎలక్ట్రికల్‌)–30, డిప్లొమా ట్రెయినీ(సివిల్‌)–05.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
► ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 29.06.2021
► వెబ్‌సైట్‌: https://www.powergrid.in

ఎస్‌బీఐలో 16 ఇంజనీర్‌(ఫైర్‌) పోస్టులు
స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ)కి చెందిన సెంట్రల్‌ రిక్రూట్‌మెంట్‌ అండ్‌ ప్రమోషన్‌ విభాగం.. ఇంజనీర్‌(ఫైర్‌)పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

► మొత్తం పోస్టుల సంఖ్య: 16

అర్హత: బీఈ/బీటెక్‌(ఫైర్‌ టెక్నాలజీ–సేఫ్టీ ఇంజనీరింగ్‌)/బీఎస్సీ(ఫైర్‌) ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో నాలెడ్జ్‌ ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

► ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభ తేది: 15.06.2021

► ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 28.06.2021

► వెబ్‌సైట్‌: https://www.sbi.co.in

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు