ఈ జలపాతాలు తప్పక చూడాల్సిందే.. ఎక్కడ ఉన్నాయో తెలుసా..?

15 Jul, 2022 15:28 IST|Sakshi

ప్రకృతిలో ఎన్నో సుందర దృశ్యాలు కళ్లు ముందు కనిపిస్తుంటాయి. వాటిని చూసినపుడు ఎంతో ఆనందంగా, ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కాగా, వానాకాలంలో వాటర్‌ ఫాల్స్‌ను చూసేందుకు పర్యాటకులు ఎంతో ఆసక్తి చూపిస్తారు. ప్రపంచంలో ఫేమస్‌ జలపాతం అనగానే.. అందరికీ నయాగరా వాటర్‌ గుర్తుకు వస్తాయి. 

కాగా, మన దేశంలో కూడా నయాగరా వాటర్‌ ఫాల్స్‌కు తీసిపోని ఓ జలపాతం ఉంది. అంతకుమించిన అందాలు.. కర్ణాటకలోని ఉన్నాయి. షిమోగా జిల్లాలోని జోగ్‌ జెర్‌సొప్పా జలపాతం పర్యాటకులను కట్టిపడేస్తోంది. కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జలపాతం ఎంతో సుందరంగా కనిపిస్తోంది. చుట్టూ ఎత్తయిన కొండల మధ్య నుంచి వచ్చే ఈ జలపాతం పర్యాటకులకు ఇష్టమైన ప్రదేశమని ఓ విదేశీ టూరెస్ట్‌ సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ చేశాడు. ఇది నయాగరా ఫాల్స్ కాదు. జోగ్ ఫాల్స్. అద్భుతమైన వీడియో చూడండి వ్యాఖ్యలు చేశారు. 

ఇదిలా ఉండగా.. తెలుగు రాష్ట్రాల్లో జలపాతాలు సైతం భారీ వర్షాల కారణంగా పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. తెలంగాణలో ములుగు జిల్లాలోని భోగతా, ఆదిలాబాద్‌లోని కుంతాల, ఆసిఫాబాద్‌లోని మిట్టే జలపాతాలు కట్టిపడేస్తున్నాయి. ఈ క్రమంలనే మరో నెటిజన్‌.. కేరళలోని త్రిసూర్ జిల్లా అత్తిరప్పిల్లి జలపాతాలను మర్చిపోవద్దంటూ ట్వీట్ చేశాడు.

మరిన్ని వార్తలు