‘జంగిల్‌ రాకుమారుడికి ఇక విశ్రాంతినివ్వండి’

4 Nov, 2020 16:50 IST|Sakshi

పాట్నా: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధ్యక్షుడు జేపీ నడ్డా బిహార్‌ ఎన్నికల ప్రచారంలో మరోసారి ప్రతిపక్షనేత తేజస్వీ యాదవ్‌పై విమర్శలు కురిపించారు. జంగిల్‌ రాజ్యానికి రాకుమారుడైన తేజస్వీ యాదవ్‌ విధానసభలో ప్రతిపక్ష నాయకుడని కానీ ఆయన ఒక్కసారి కూడా అసెంబ్లీ రారు అన్నారు. అందుకే తేజస్వీ యాదవ్‌కు విశ్రాంతినివ్వండి, నితీశ్‌కు పని కల్పించండి అంటూ  ప్రచారం చేశారు. తేజస్వి యాదవ్‌ అబద్దాలు చెబుతారంటూ మండిపడ్డారు. బీహార్‌లో నేడు మూడో విడదత పోలింగ్‌ జరగగా 7వ తేదీతో అన్ని దశల పోలింగ్‌ ముగియనుంది.

ఎన్నికల ఫలితాలు ఈ నెల 10వ తేదీన ప్రకటించనున్నారు. కాంగ్రెస్‌ పార్టీ నేత రాహుల్‌గాంధీ, మహాకూటమి తరుపున సీఎం అభ్యర్థిగా నిలిచిన తేజస్వీ యాదవ్‌ కరోనా టైంలో భయపడి బయటకు రాలేదని, కానీ ఇప్పుడు ఏం జరిగిందని ప్రశ్నిస్తున్నారన్నారు. కేవలం బీజేపీ, ఆ పార్టీ కార్యకర్తలు మాత్రమే కరోనా సమయంలో సేవలందించారన్నారు. ఇక బిహార్‌ ఎన్నికల్లో ఇప్పటి వరకు 54 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎలక్షన్లలలో ఓటింగ్‌ శాతం పెరిగే అవకాశాలు ఉన్నాయి.   

చదవండి: సీఎంపై రాళ్లదాడి, ఫెయిల్యూర్‌ అంటూ..

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు