జార్ఖండ్‌ జడ్జి మృతి కేసుపై స్పందించిన సుప్రీంకోర్టు

30 Jul, 2021 15:19 IST|Sakshi

న్యూఢిల్లీ: జార్ఖండ్ జడ్జి మృతి కేసుపై సుప్రీంకోర్టు స్పందించింది. వారంలోపు నివేదిక ఇవ్వాలని ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా.. జార్ఖండ్ ఏజీని వచ్చేవారం విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. 

కాగా ధన్‌బాద్‌లో ఉదయం జాగింగ్‌కు వెళ్లిన డిస్ట్రిక్ట్, 8వ సెషన్స్‌ జడ్జి ఉత్తమ్‌ ఆనంద్‌ను దుండగులు ఆటోతో ఢీకొట్టగా.. ఆయన మృతి చెందిన విషయం విదితమే. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో జార్ఖండ్‌ హైకోర్టు స్పందింది, ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణకు ఆదేశించింది. ఇక ఈ ఘటనను సమోటోగా స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం సీఎస్‌, డీజీపీని నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

మరిన్ని వార్తలు