చదువుల తల్లికి కోర్టు అండ.. అడ్మిషన్‌ ఫీజు అందించిన వైనం

30 Nov, 2021 17:13 IST|Sakshi

లక్నో:  ప్రతిష్టాత్మక ఐఐటీ బనారస్ హిందూ యూనివర్శిటీ (బీహెచ్‌యూ)కి అర్హత సాధించినప్పటికీ ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా అడ్మిషన్‌ కోల్పోతున్నాను అంటూ దళిత సామాజిక వర్గానికి చెందిన బాలిక సంస్కృతి రంజన్‌ అలహాబాద్‌ హైకోర్టుని ఆశ్రయించింది. అయితే ఆమె జేఈఈ ఉమ్మడి పరీక్షలో 92 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి, షెడ్యూల్డ్‌ కులాల విభాగంలో రెండు వేల ర్యాంకును సాధించింది. ఈ మేరకు సంస్కృతి రంజన్‌ హైకోర్టుకు హాజరై... ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా గణితం, కంప్యూటర్‌ కోర్సులకు సంబంధించిన ఐదేళ్ల కోర్సు ప్రవేశ రుసుము మొత్తం రూ 15 వేలు చెల్లించలేకపోతున్నాను. నా తండ్రి కిడ్ని వ్యాధి కారణంగా మా కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో సతమతమౌతోంది’’ అని తెలిపింది.

(చదవండి: జపాన్‌లో తొలి ఒమిక్రాన్‌ కేసు..!!)

అంతేకాక ‘‘నేను నా పరిస్థితిని వివరిస్తూ..అడ్మిషన్‌ గడువు తేదిని పొడిగించండి అంటూ జాయింట్ సీట్ల కేటాయింపు అథారిటీకి చాలాసార్లు లేఖ రాసినప్పటికీ వారి నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. అందువల్ల నన్ను కాలేజీలో చేర్చుకునేలా విశ్వవిద్యాలయానికి, కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ సీట్ల కేటాయింపు సంస్థకు ధర్మాసనం ఆదేశాలు ఇవ్వాలి" అని పిటిషన్‌ దాఖలు చేసింది. దీన్ని విచారించిన దినేష్ కుమార్ సింగ్‌తో కూడిన సింగిల్ జడ్జి బెంచ్ యూనివర్సిటిలో మూడు రోజుల్లో రిపోర్టు చేయాల్సిందిగా పిటిషన్‌లో కోరింది.

అయితే ధర్మాసనం ఆమె కుటుంబ ఆర్థిక పరిస్థితిని గుర్తించడమేకాక తన తండ్రి ఆరోగ్య దృష్ట్యా కిడ్ని మార్పిడి చేయించుకోమని సలహా సూచించింది. ఈ క్రమంలో న్యాయమూర్తి దినేశ్‌సింగ్‌ మాట్లాడుతూ..."అంతేకాదు మేము ఈ కేసుకి సంబంధించిన వాస్తవాలను పరిగణలోనికి తీసుకుని డబ్బుని అందజేస్తాం. పైగా ఒక దళిత యువతి ఐఐటీలో ప్రవేశం పొందాలనే తన కలను సాకారం చేసుకునేందుకు తనకు న్యాయం చేయమని కోరుతూ ఈ కోర్టు ముందుకి వచ్చింది. అందువల్లే ఈ కోర్టు స్వయంగా సీటు కేటాయింపు కోసం రూ. 15,000 విరాళంగా ఇస్తోంది." అని న్యాయమూర్తి దినేశ్‌ సింగ్‌ అన్నారు. 

(చదవండి: బాప్‌రే!... రెండు తలలు ఉన్న బల్లిని చూశారా!!)

మరిన్ని వార్తలు