July 8th: వాస్కోడగామా తొలిసారి ఇండియాకు పడవెక్కిన రోజు

8 Jul, 2022 14:00 IST|Sakshi

పదిహేనవ శతాబ్దాపు ప్రముఖ పోర్చుగీసు నావికుడు వాస్కోడగామా తొలిసారి నేరుగా ఇండియాకు నౌకాయానం ప్రారంభించిన రోజు ఇది. 1497 జూలై 8న ఆయన మహాయాత్ర లిస్బన్‌ రేవు నుంచి మొదలైంది. ఆఫ్రికాలోని ‘కేప్‌ ఆఫ్‌ గుడ్‌ హోప్‌’ ప్రాంతాన్ని చుడుతూ ఏడాది తర్వాత 1498 మే 20న ఇండియాలోని కోళికోడ్‌ (కేరళ) తీర ప్రాంతాన్ని చేరుకుంది.

ఐరోపా నుంచి సముద్ర మార్గంలో ఒకరు ఇండియాకు రావడం అదే మొదటిసారి. దాంతో ఐరోపా మళ్లీ ఇండియాతో  తన వ్యాపార సంబంధాలను పునరుద్ధరించుకుంది. మొదట గ్రీకులు, రోమన్‌లు అరబ్‌లు భారత్‌ నుంచి సరకు కొనుక్కెళ్లి ఐరోపాలో లాభానికి అమ్ముకునేవారు. కాన్‌స్టాంట్‌నోపుల్‌ మీదుగా భారత్‌కు భూమార్గం అందుబాటులో ఉన్నంతవరకు వీళ్ల వ్యాపారాలన్నీ సజావుగా సాగాయి. ఎప్పుడైతే తురుష్కులు కాన్‌స్టాంట్‌ నోపుల్‌ను ఆక్రమించుకున్నారో అప్పటి నుంచి ఆ దారి మూసుకుపోయింది.

మరిన్ని వార్తలు