NHRC చైర్మన్‌గా జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా.. ఖర్గే అభ్యంతరం

2 Jun, 2021 17:15 IST|Sakshi

ఢిల్లీ: సుప్రీంకోర్టు మాజీ న్యాయ‌మూర్తి జ‌స్టిస్ అరుణ్ మిశ్రా బుధవారం జాతీయ మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్ చైర్మ‌న్‌గా(ఎన్‌హెచ్‌ఆర్సీ) బాధ్య‌త‌లు స్వీక‌రించారు. మాజీ జ‌స్టిస్ హెచ్ఎల్ ద‌త్తు ప‌ద‌వీకాలం ముగిసిన త‌ర్వాత‌.. ఎన్‌హెచ్ఆర్‌సీ ఛైర్మన్‌ పోస్టు గ‌త ఏడాది డిసెంబ‌ర్ నుంచి ఖాళీగా ఉన్న‌ది. ఇవాళ జ‌స్టిస్ అరుణ్ మిశ్రాతో పాటు ఓ ప్యానెల్ స‌భ్యుడు కూడా చేరారు.

అయితే అరుణ్‌ మిశ్రాను మోదీ నేతృత్వంలోని హై పవర్డ్‌ కమిటీ రాష్ట్రపతికి రికమెండ్‌ చేసింది. ఆ హైపవర్డ్‌ క​మిటీలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు హోంమంత్రి అమిత్‌ షా, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాతో  రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు మల్లిఖార్జున్‌ ఖర్గేలు ఉన్నారు. కాగా మల్లిఖార్జున్‌ ఖర్గే అరుణ్‌ మిశ్రా నియామకాన్ని తప్పుబట్టారు.షెడ్యూల్డ్ కాస్ట్‌ లేదా షెడ్యూల్డ్ తెగకు చెందిన వ్యక్తిని ఎన్‌హెచ్‌ఆర్‌సీ  చైర్‌పర్సన్‌గా ఎంపిక చేస్తే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు.

జ‌స్టిస్ మిశ్రా సుప్రీంకోర్టు జ‌డ్జిగా 2014లో చేరారు. గ‌త ఏడాది సెప్టెంబ‌ర్‌లో ఆయ‌న రిటైర్ అయ్యారు. కోల్‌క‌తా, రాజ‌స్థాన్ హైకోర్టుల్లో ఆయ‌న చీఫ్ జ‌స్టిస్‌గా చేశారు. జ‌స్టిస్ మిశ్రా తండ్రి హ‌ర్‌గోవింద్ మిశ్రా మ‌ధ్య‌ప్ర‌దేశ్ హైకోర్టు జ‌డ్జిగా చేశారు. భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి హెచ్ఎల్ దత్తు 2020 డిసెంబర్‌లో పదవీ విరమణ చేశారు. కాగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ప్రఫుల్ చంద్ర పంత్ ప్రస్తుతం ఎన్‌హెచ్‌ఆర్‌సీ తాత్కాలిక చైర్మ‌న్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.
చదవండి: వ్యాక్సిన్ తీసుకుంటేనే ప్రభుత్వ ఉద్యోగులకు జీతం

మరిన్ని వార్తలు