కొత్త సీజేఐ నియామకానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర

18 Oct, 2022 06:50 IST|Sakshi

న్యూఢిల్లీ: నూతన సీజేఐగా జస్టిస్‌ ధనంజయ వై. చంద్రచూడ్‌ను నియమిస్తూ సంబంధిత ఉత్తర్వుపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సంతకం చేశారు. భారత ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ యూయూ లలిత్‌ సిఫార్సు తర్వాత సంబంధించి ప్రతిని కేంద్ర న్యాయశాఖ.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు పంపగా ఆమె ఆమోదించారని ఆ శాఖ మంత్రి కిరెణ్‌ రిజిజు తెలిపారు.

నవంబర్‌ 9న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)గా ­జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ప్రమాణం చేస్తారని రిజిజు ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. అప్పటి నుంచి రెండు సంవత్సరాలపాటు అంటే 2024 నవంబర్‌ పదో తేదీ దాకా ఆయన సీజేఐగా కొనసాగుతారు. కొత్త సీజేగా నియామకపత్రాన్ని ప్రధాని ప్రధాన సలహాదారు పీకే మిశ్రా, న్యాయశాఖ ఉన్నతాధికారులు స్వయంగా జస్టిస్‌ చంద్రచూడ్‌కు అందజేశారు. ప్రస్తుత సీజేఐ లలిత్‌ కేవలం 74 రోజులే ఆ బాధ్యతల్లో కొనసాగి రిటైర్‌కానున్నారు.

ఇదీ చదవండి: Facebook Live: పోనీయ్‌.. 300 కి.మీ.లు దాటాలి

మరిన్ని వార్తలు