రిటైరైన జస్టిస్‌ నజీర్‌

5 Jan, 2023 05:43 IST|Sakshi

ప్రజా న్యాయమూర్తి అంటూ సీజేఐ ప్రశంస  

న్యూఢిల్లీ: జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా విశేష సేవలందించారని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ కొనియాడారు. బుధవారం సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ వీడ్కోలు సభలో ఆయన ప్రసంగించారు. ‘‘జస్టిస్‌ నజీర్‌ది బహుముఖీన వ్యక్తిత్వం.

సాధారణ కుటుంబంలో జన్మించి స్వయం కృషితో ఉన్నత స్థానానికి చేరుకున్నారు. ప్రజా న్యాయమూర్తిగా పేరుగడించారు’’ అన్నారు. న్యాయ వ్యవస్థలో మహిళల ప్రాతినిధ్యం తగినంత లేకపోవడం బాధాకరమని జస్టిస్‌ నజీర్‌ అన్నారు. జూనియర్‌ లాయర్లకు మంచి వేతనాలు, మరిన్ని అవకాశాలు కావాలని అభిప్రాయపడ్డారు.

మరిన్ని వార్తలు