కేంద్ర మంత్రి ఉల్లిపాయల ఐడియా!.. మీరూ ట్రై చేస్తారా..?

27 May, 2023 21:12 IST|Sakshi

గ్వాలియర్‌: ఎండాకాలం విపరీతంగా ఎండలు పెరిగిపోతున్నాయి. వడగాల్పుల నుంచి తట్టుకోవడానికి రకరకాల వంటింటి చిట్కాలు పాటిస్తుంటారు. కేంద్ర విమానయాన శాఖమంత్రి జ్యోతిరాదిత్య సింథియ కూడా ఉల్లిపాయల చిట‍్కాను పాటిస్తున్నట్లు చెప్పారు. ఎండ వేడి నుంచి తప్పించుకోవడానికి అధికారులకు కూడా ఆయన ఆ చిట్కాను సూచించారు.

వేడికి ఉల్లిపాయల ఐడియా
మధ్యప్రదేశ్‌ గ్వాలియర్‌లో ఎండలు విపరీతంగా పెరిగాయి. దాదాపు 45డిగ్రీల సెల్సియస్ వరకు చెరుకున్నాయి. దీంతో రోజురోజుకూ వడదెబ్బతో మరణాల సంఖ్య పెరుగుతోంది. గత వారం రోజుల్లోనే 50 మంది ఆసుపత్రిలో చేరారు. దీంతో కేంద్ర మంత్రి సింథియా వేడినుంచి తప్పించుకోవడానికి ఉల్లిపాయలు తెచ్చుకోవాలని సూచనలు చేశారు. అధికారులు కూడా పాటించాలని సూచించారు. తానూ పాటిస్తున్నట్లు చెప్పారు.

ఎండాకాలం అయినందున ఇంటి నుంచి బయటకు వెళ్లేప్పుడే తన పాకెట్‌లో ఉల్లిగడ్డలు వెంట తెచ్చుకుంటున్నారట సింథియా. వాటిని ఉపయోగించి శరీరంలో వేడిని తగ్గించుకోవచ్చని చెప్పారు. వేసవి ఎండల్లోనూ పార్టీ కార్యక్రమాల్లో నిరాటంకంగా పనిచేయగలుగుతున్నానని తెలిపారు. ఉల్లిపాయలు శరీరంలో వేడిని గణనీయంగా తగ్గిస్తాయని వెల్లడించారు. మధ్యప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. అజయ్ పాల్ కూడా ఎండల వేడి నుంచి తప్పించుకోవడానికి పలు సూచనలు చేశారు. తగిన మోతాదుల్లో నీటిని తాగాలని సూచించారు.

ఇదీ చదవండి:'సెంట్రల్ విస్టాపై ప్రతిపక్షాలది తప్పుడు చర్య.'

మరిన్ని వార్తలు