వైరల్‌: కోతుల్ని తరిమి కొట్టండి: సీటు గెలవండి!

16 Nov, 2020 11:07 IST|Sakshi
కాల్‌పెట్ట ప్రజలు

తిరువనంతపురం : తమను కోతుల బెడద నుంచి తప్పించిన అభ్యర్థికే మున్సిపల్‌ ఎన్నికల్లో ఓటు వేస్తామంటున్నారు కేరళలోని వయనాద్‌ ప్రజలు. కోతుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిన వారికి మాత్రమే ఓట్లేస్తామంటున్నారు. ఈ మేరకు కాల్‌పెట్ట మున్సిపాలటీలోని హరితగిరి రెసిడన్స్‌ అసోసియేషన్‌ ఆదివారం తీర్మానం చేసింది. రాజకీయ పార్టీ బ్యానర్ల ముందు తమ గోడును వెల్లబోసుకుంటూ వీరు కూడా బ్యానర్లు ఉంచారు.  కాల్‌పెట్ట మహిళ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘  నా వయస్సు 62 సంవత్సరాలు. ప్రతీ ఏటా నేను మున్సిపల్‌ ఎన్నికల్లో ఓటు వేస్తూ వస్తున్నాను. కానీ, ఈ సారి అలా కాదు! కోతుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిన వారికి మాత్రమే ఓటేస్తా. ( వైరల్‌: మరీ ఇంత పిరికి పులిని చూడలేదు )

మా ఏరియాలో కోతులు నానాబీభత్సం చేస్తున్నాయి. ఇళ్లపై పెంకులు తీసేస్తున్నాయి. వంటగదిలోకి ప్రవేశించి ఆహారాన్ని దొంగలిస్తున్నాయి. వాటికి భయపడి ఆహారాన్ని పడకగదిలో దాచుకుంటున్నాం. కోతుల సమస్యను పరిష్కరించటానికి ఇప్పటివరకు ప్రజా ప్రతినిధులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని’’ తెలిపారు. పోస్టుమాస్టర్‌ రాకేశ్‌ మాట్లాడుతూ.. ‘‘నేను ఏ ఇంటికైనా వెళ్లిన ప్రతీసారి, ఆ ఇంటివారు కోతుల్ని దూరంగా తరమాల్సిన పరిస్థితి వస్తుంది. కొన్నిసార్లు అవి నాపై దాడికి ప్రయత్నించేవి. ఇక్కడి ప్రజలు కోతుల కారణంగా చాలా ఇబ్బందులు పడుతున్నార’’ని అన్నారు.

>
మరిన్ని వార్తలు