రజనీకాంత్‌తో పొత్తు ఉంటుందా; కమల్‌ కీలక వ్యాఖ్యలు

15 Dec, 2020 13:21 IST|Sakshi

సాక్షి, చెన్నై: తమిళనాడులో రాజకీయం వేడెక్కుతోంది. వచ్చే ఏడాది మే నెలలో జరిగే అసెంబ్లీ ఎన్నికల ముందస్తు ప్రచారానికి  పలు పార్టీలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. తాజాగా మక్కల్‌ నీది మయ్యం నేత, నటుడు కమల్‌హాసన్‌ తన పార్టీ ఎన్నికల ప్రచార షెడ్యూల్‌ను సోమవారం మధురైలో లాంచ్‌ చేశారు. ఈ క్రమంలో అభిమానులు ఏర్పాటు చేసిన భారీ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. పెద్ద ఎత్తున అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను ఎన్నికల్లో పోటీ చేస్తానని.. అయితే ఏ నియోజకవర్గం నుంచి దిగుతాననే విషయాన్ని త్వరలో ప్రకటిస్తానని అన్నారు. చదవండి: కమల్‌తో అసద్‌.. దోస్తీ!

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ఏర్పాటు చేయబోయే పార్టీతో పొత్తు పెట్టుకుంటారా? అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు.. ‘పొత్తులు కొన్ని సార్లు విడిపోతాయి. మరికొన్ని సార్లు కొత్తవి పుట్టుకువస్తాయి. ప్రస్తుతానికి రజనీకాంత్‌ పార్టీతో పొత్తు విషయం గురించి నిర్ణయం తీసుకోలేదని’ అన్నారు. ఇక కమల్‌ హాసన్‌ పాల్గొన్న ర్యాలీపై పలు విమర్శలు వస్తున్నాయి. ఆయన కోవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించారని, ర్యాలీలో పాల్గొన్న క్రమంలో మాస్క్‌ కూడా ధరించలేదని చర్చించుకుంటున్నారు. ఇక కమల్‌ ర్యాలీలో భారీగా పాల్గొన్న అభిమానులు, కార్యకర్తలు భౌతికదూరం పాటించకుండా ఉన్న వీడియోలు సోషల్‌ మీడియాలో  చక్కర్లు కొడుతున్నాయి. 
చదవండి: మోదీపై ప్రశ్నల వర్షం కురిపించిన కమల్‌

మరిన్ని వార్తలు