నన్ను చంపుతామని బెదిరించారు: కంగనా రనౌత్‌

3 Dec, 2021 18:34 IST|Sakshi

చండీగఢ్: బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌కు రైతుల నిరసన సెగ తగిలింది. పంజాబ్‌లోని కిరాత్‌పూర్ సాహిబ్ సమీపంలో ఆమె కారును పెద్ద ఎత్తున రైతు నిరసనకారులు అడ్డగించారు. రైతులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. కేంద్రం తీసుకువచ్చిన సాగు చట్టాలను వ్యతిరేకరంగా నిరసన తెలిపిన రైతులను ఉగ్రవాదులు, ఖలిస్తానీలతో పోల్చుతూ కంగనా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

చదవండి:  Sanya Malhotra: చివరి బ్రేకప్‌ నా హృదయాన్ని కదిలించింది

అయితే శుక్రవారం కంగనా ప్రయాణిస్తున్న కారును రైతులు జెండాలతో నినాదాలు చేస్తూ అడ్డగించారు. ‘నన్ను రైతు నిరసనకారులు పెద్ద ఎత్తున చుట్టుముట్టారు. దూషిస్తూ.. నన్ను చంపుతామని బెదిరించారు’ అని ఆమె కంగన ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు.

రైతు నిరసనకారులు గుంపుగా చుట్టూ చేరేసరికి ఏం చేయాలో తోచలేదని తెలిపారు. సెక్యూరిటీ సిబ్బంది కూడా తనతో లేరని, తాను రాజకీయ నాయకురాలిని కాదని చెప్పారు. రైతు నిరసనకారులు తనను అడ్డిగించడాన్ని కంగనా తీవ్రంగా ఖండించారు. కేంద్రం రైతుల కోసం తీసుకువచ్చిన మూడు సాగు చట్టాలను ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు