Karnataka: నిర్లక్ష్యం వహిస్తే మళ్లీ లాక్‌డౌన్‌: సీఎం

8 Jul, 2021 09:55 IST|Sakshi

2 వేలకు ఎగువనే ‘కరోనా’

3 వేల డిశ్చార్జ్‌లు  

సాక్షి, బెంగళూరు: మహమ్మారి కరోనా తగ్గినట్లే తగ్గి స్థిరంగా కొనసాగుతోంది. గత 24 గంటల్లో రాష్ట్రంలో 2,743 పాజిటివ్‌ కేసులు నిర్ధారించారు. 3,081 మంది కోలుకున్నారు. 75 మంది కన్నుమూయడంతో మొత్తం మరణాలు 35,601 మందికి పెరిగాయి. కరోనా కేసుల మొత్తం 28,62,338, డిశ్చార్జ్‌లు 27,87,111 కి చేరాయి. 39,603 మంది కరోనాతో చికిత్స పొందతుండగా పాజిటివిటీ రేటు 1.64 శాతంగా ఉంది.  

బెంగళూరులో 611 కేసులు..  
ఐటీ సిటీలో తాజాగా 611 కేసులు, 693 డిశ్చార్జిలు, 12 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 12,17,507కు పెరిగింది. అందులో 11,87,666 మంది కోలుకున్నారు. 15,702 మంది మరణించారు. 14,138 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. రాష్ట్రంలో కొత్తగా 1,66,631 నమూనాలు పరీక్షించారు. మొత్తం టెస్టులు 3,53,18,762 అయ్యాయి. మరో 2,08,439 మందికి కరోనా టీకా పంపిణీ చేశారు. దీంతో మొత్తం టీకాల సంఖ్య 2,46,91,636 కి పెరిగింది.  

నిర్లక్ష్యం వహిస్తే మళ్లీ లాక్‌డౌన్‌
దొడ్డబళ్లాపురం: అన్‌లాక్‌ చేశామని జనం ఇష్టానుసారంగా తిరిగి కరోనా వ్యాప్తికి కారణమయితే 15 రోజుల్లో మళ్లీ లాక్‌డౌన్‌ అమలు చేయాల్సి వస్తుందని, కాబట్టి కరోనా నియమాలను కట్టుదిట్టంగా పాటించాలని సీఎం యడియూరప్ప ప్రజలను హెచ్చరించారు. దొడ్డ పట్టణంలో నూతనంగా నిర్మించిన కోవిడ్‌ తాత్కాలిక ఆస్పత్రిని ఆయన బుధవారం ప్రారంభించారు. 70 బెడ్లతో ఆస్పత్రిని నిర్మించామన్నారు. కరోనా థర్డ్‌ వేవ్‌ను ఎదుర్కొనడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.    

మరిన్ని వార్తలు