అక్కడ 295 గ్రామాల్లో కరోనా కేసులు లేవు.. ఇదే కారణమట

3 Jun, 2021 14:20 IST|Sakshi

సాక్షి, బెంగళూరు (దొడ్డబళ్లాపురం): బెంగళూరు గ్రామీణ జిల్లాలో కరోనా సర్వాంతర్యామిగా మారి విలయం సృష్టిస్తుంటే ఈ జిల్లాలోని 295 గ్రామాల్లో మాత్రం కరోనా ఆటలు సాగడంలేదు. ఇందుకు కారణం జిల్లా పంచాయతీ సీఈఓ రవికుమార్‌ ముఖ్య కారణమని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో 1,091 గ్రామాలు ఉండగా వీటిలో 295 గ్రామాల్లో ఇప్పటికీ కరోనా అడుగుపెట్టలేకపోతోంది. అందులోనూ 157 గ్రామాల్లో ఇప్పటి వరకూ ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు.

నెలమంగల తాలూకాలో 151, హొసకోటలో 71, దొడ్డబళ్లాపురం తాలూకాలో 62, దేవనహళ్లి తాలూకాలో 11 గ్రామాల్లో కరోనా ఆటకట్టించారు. జిల్లా పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌ సభ్యులు ఆయా గ్రామాల ప్రజల సహకారంతో ఇదంతా సాధించారు. ఈ గ్రామాల్లో ఇతర ప్రాంతాల నుండి వచ్చే ప్రతి ఒక్కరికీ కోవిడ్‌ టెస్టు చేసిగానీ గ్రామాల్లోకి అనుమతించడంలేదు. ఇదంతా జిల్లా పంచాయతీ సీఈఓ రవికుమార్‌ దిశానిర్దేశం మేరకు జరుగుతోందని అధికారులు అంటున్నారు.

చదవండి: పంచాయతీ ఎన్నికల్లో ఓటేయలేదని గ్రామస్తులపై ఆగ్రహం  

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు