Karnataka: అఫ్గాన్లలో కలవరం.. మా వాళ్లకు అక్కడ నరకమే! 

18 Aug, 2021 14:34 IST|Sakshi
ఫొటో: సోషల్‌ మీడియా

సాక్షి, బెంగళూరు: అఫ్గానిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకోవడం, అక్కడ తీవ్ర సంక్షోభం ఏర్పడడంతో కన్నడనాట ఉన్న ఆ దేశవాసులు దిగులు చెందుతున్నారు. తమ వారు ఎలా ఉన్నారోనని కలవరానికి గురయ్యారు. రాష్ట్రంలో అధికారికంగా 339 అఫ్గాన్‌ పర్యాటకులు ఉండగా,  వారిలో బెంగళూరులో 212 మంది ఉన్నారు. మరో 192 మంది విద్యార్థులు రాష్ట్రంలో పలు విద్యాసంస్థల్లో చదువుకుంటున్నారు.

ఇక 147 మంది వ్యాపార, పర్యాటకం వీసా కింద వచ్చి నివాసం ఉంటున్నారు. అనధికారికంగానూ మరికొందరు తలదాచుకుంటున్నారు. బెంగళూరులోని విద్యార్థులు మాట్లాడుతూ తమ దేశానికి పొరుగుదేశాలు సాయం చేయాలని కోరారు. అక్కడ తమ తల్లిదండ్రులు, బంధువులు రెండురోజుల నుంచి ఇళ్ల నుంచి బయటకు రావడం లేదని, ప్రజలు నరకం చవిచూస్తున్నారని వాపోయారు. 

మైసూరు వర్సిటీలో 90 మంది 
మైసూరు: మైసూరు వర్సిటీలో సుమారు 90 మంది అఫ్గాన్‌ విద్యార్థులు చదువుకుంటుండగా, స్వదేశంలో తాలిబాన్ల దాడితో వారు ఖిన్నులయ్యారు. తమ కుటుంబాలకు ఫోన్లు చేసి పరిస్థితిని తెలుసుకుంటున్నారు. వీసీ జి.హేమంత్‌ కుమార్‌ మాట్లాడుతూ ఈ విద్యార్థుల్లో 36 మంది వీసా గడువు అక్టోబర్‌ లో ముగుస్తుందని చెప్పారు.  

చదవండి: Afghanistan: తాలిబన్ల తొలి మీడియా సమావేశం.. కీలక వ్యాఖ్యలు
Afghanistan: అటు తాలిబాన్‌.. ఇటు ఇరాన్‌.. మధ్యలో ఇండియా

 

మరిన్ని వార్తలు