‘నేను అవినీతి ఉద్యోగిని కాను’.. అని బోర్డు పెట్టి..

26 Sep, 2022 12:21 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

అక్టోబరు నుంచి సర్కారీ ఆఫీసుల్లో అభియాన 

బనశంకరి(కర్ణాటక): రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ పే సీఎం అభియాన్‌ పేరుతో అవినీతి ఆరోపణలు గుప్పించడంతో బొమ్మై ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూస్తోంది. పేసీఎంకు సమాధానంగా ప్రభుత్వ కార్యాలయాల్లో లంచ వ్యతిరేక ప్రచారోత్సవం చేపట్టనుంది. నాకు ఎవరూ లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను అవినీతి ఉద్యోగి/ అధికారిని కాదు అనే నినాదంతో అక్టోబరు 2 నుంచి 20వ తేదీ వరకు అభియానను నిర్వహించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. పై నినాదంతో అన్ని ఆఫీసుల్లో బోర్డులు పెట్టాలని తెలిపారు.  

కాగా ఇటీవల యూపీఐ పేమెంట్ యాప్‌ పేటీఎం తరహాలో ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై ఫోటోన్ని ముద్రించిన  ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అస్త్రంగా మార్చుకుంది. ఈ ఫోటోని  క్యూఆర్‌ కోడ్‌తో ‘పేసీఎం’ పోస్టర్ల లా ప్రింట్రింగ్‌ చేసి బెంగళూరు నగరంలో ఏర్పాటు చేసింది. ఆ క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసినట్లయితే.. వినియోగదారులు నేరుగా ‘40 శాతం సర్కార్‌’ వెబ్‌సైట్‌కు తీసుకెళ్తుంది. ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిపై ఫిర్యాదు చేసేందుకు ఈ వెబ్‌సైట్‌ను కాంగ్రెస్‌ ప్రారంభిన సంగతి తెలిసందే. 

చదవండి: కాంగ్రెస్ 'పేసీఎం' పోస్టర్‌లో నటుడి ఫోటో.. కోర్టుకెళ్తానని వార్నింగ్

మరిన్ని వార్తలు