రాసలీలల కేసు: అజ్ఞాతంలోకి జార్కిహొళి?

1 Apr, 2021 07:45 IST|Sakshi

యువతి రాకతో మారిన పరిణామాలు

సాక్షి, బెంగళూరు: రాసలీలల సీడీ కేసులో మాజీ మంత్రి రమేశ్‌ జార్కిహొళి అరెస్టు భయాన్ని ఎదుర్కొంటున్నారు. ఇన్నిరోజులూ అజ్ఞాతంలో ఉన్న సీడీలోని యువతి మంగళవారం కోర్టులో లొంగిపోవడం, జడ్జికి వాంగ్మూలమివ్వడం తెలిసిందే. బుధవారం ఆమెను సిట్‌ పోలీసులు తీసుకెళ్లి విచారించారు. రెండుచోట్లా జార్కిహొళి తనను లైంగిక వేధింపులు, మోసం, బెదిరింపులకు గురిచేశారని ఆరోపించినట్లు తెలిసింది. దీంతో రమేశ్‌ జార్కిహొళి అరెస్టు భయంతో ముంబయికి వెళ్లిపోయినట్లు ప్రచారం సాగుతోంది.  ఎవరికీ అందుబాటులోకి లేకుండా అజ్ఞాతంలోకెళ్లారు.

ఢిల్లీ వకీళ్లతో మంతనాలు..  
తాను ఏ తప్పూ చేయలేదని, సీడీ వీడియోలన్నీ కల్పితాలని జార్కిహొళి చెబుతూ ఉన్నారు. యువతి కోర్టు, సిట్‌ ముందుకు వచ్చేసరికి జార్కిహొళి ఆందోళనకు గురయ్యారు. ఢిల్లీ నుంచి న్యాయవాదులను రప్పించుకుని తరుణోపాయాలపై మంతనాలు ప్రారంభించారు. ఢిల్లీకి చెందిన నలుగురు ప్రముఖ న్యాయవాదులతో పాటు కర్ణాటకకు చెందిన మరో ఇద్దరితో చర్చించినట్లు ఉన్నట్లు తెలిసింది. తనపై ఉన్న ఎఫ్‌ఐఆర్‌ రద్దు కోరుతూ పిటిషన్‌ వేయాలని నిర్ణయించారు.  

చదవండి: శారీరకంగా వాడుకున్నా అందుకే మౌనందాల్చా
రాసలీలల కేసు: అజ్ఞాతం వీడిన యువతి... మంత్రికి భారీ షాక్‌! 

మరిన్ని వార్తలు