విద్యార్థులు, మహిళా ఉద్యోగులకు ఉచిత బస్సు ప్రయాణం.. ఎక్కడంటే?

22 Feb, 2023 12:28 IST|Sakshi

బెంగళూరు: పాఠశాల విద్యార్థులు, మహిళా ఉద్యోగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించనున్నట్లు కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై మంగళవారం ప్రకటించారు. ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుందన్నారు. కేఎస్ఆర్‌టీసీ వోల్వో బస్సుల ప్రారంభోత్సవం సందర్భంగా ఈ హామీ ఇచ్చారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మహిళా ఓటర్లను ఆకట్టునే ప్రయత్నం చేశారు.

కొత్త పథకంలో భాగంగా విద్యార్థుల కోసం మరిన్ని మినీ బస్సులు అందుబాటులోకి తీసుకురానున్నట్లు సీఎం చెప్పారు. ఒక్కో తాలుకాలో కనీసం ఐదు బస్సులు నడిచేలా చూస్తామన్నారు. అవసరమైతే దీని కోసం అదనపు నిధులు విడుదల చేస్తామని పేర్కొన్నారు.

ఆర్థిక అభివృద్ధిలో రవాణా ముఖ్య  పాత్ర పోషిస్తుందని బొమ్మై చెప్పారు. అందుకే తాము అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. మహిళా ఉద్యోగులు, విద్యార్థులకు ఉచిత పాసులు ఇస్తామని బడ్జెట్ సమావేశాల్లోనే చెప్పినట్లు గుర్తుచేశారు.
చదవండి: మనీశ్ సిసోడియాకు భారీ షాక్.. స్నూపింగ్‌ కేసు విచారణకు కేంద్రం ఆమోదం..

మరిన్ని వార్తలు