ఎవ్వరినీ వదలడం లేదు.. కరోనా బారిన పడ్డ మరో ఇద్దరు సీఎంలు

10 Jan, 2022 20:44 IST|Sakshi

బెంగుళూరు/పాట్నా! భారత్‌లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. లక్షల్లో రోజువారీ కేసులు వెలుగు చూస్తున్నాయంటే పరిస్థితి ఎంత ఆందోళనకరంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. ఓ వైపు సాధారణ పౌరులపై కోవిడ్‌ పంజా విసురుతుంటే మరోవైపు ప్రజాప్రతినిధులను కూడా విడిచి పెట్టడం లేదు. ఇప్ప‌టికే దేశ వ్యాప్తంగా చాలా మంది నాయులు క‌రోనా బారిన ప‌డ్డారు. ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్, పాటు కేంద్ర ర‌క్ష‌ణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌కు కరోనా సోకగా.. తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మె కోవిడ్‌ బారిన పడ్డారు. 

ఈ మేరకు సీఎం తన అధికారిక ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. తనకు కరోనా పాజిటివ్‌గా తేలిందని, స్వల్ప లక్షణాలు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగేఉందని, వైద్యుల సూచనల మేరకు హోం క్వారంటైన్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు.  ఇటీవల తననుకలిసిన వారంతా కోవిడ్‌ టెస్టులు చేయించుకొని హోం ఐసోలేషన్‌లో ఉండాలని విజ్జప్తి చేశారు. 
చదవండి: కాశీ విశ్వనాథ్ ధామ్‌ సిబ్బందికి మోదీ ఊహించని బహుమతి

మరోవైపు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌కు కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తాజాగా జరిపిన పరీక్షలో ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు సీఎం ఆఫీస్ అధికారులు వెల్లడించారు. దీంతో సీఎం నితీశ్ కుమార్ ఇంట్లోనే ఐసోలేట్ అయి చికిత్స తీసుకుంటున్నారని వెల్లడించారు. డాక్టర్లు ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు అందిస్తున్నారని వెల్లడించారు. కోవిడ్ వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
చదవండి: రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు కరోనా..

జేపీ నడ్డాకు కరోనా
బీజేపీ జాతీయ అధ్యక్షడు జేపీ నడ్డా కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపిన నడ్డా.. గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారందరూ కరోనా టెస్టులు చేసుకోవాలని సూచించారు.

మరిన్ని వార్తలు