రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు అస్తవ్యస్తంగా మారతాయి.. కర్ణాటక సీఎం హెచ్చరిక

19 Sep, 2022 18:57 IST|Sakshi

బెంగళూరు: ‘40 పర్సెంట్‌ ప్రభుత్వానికి సుస్వాగతం’అని కర్ణాటక సీఎం గురించి హైదరాబాద్‌లో వేసిన ఫ్లెక్సీలపై సీఎం బసవరాజ బొమ్మై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. శనివారం తెలంగాణ విమోచన దినోత్సవంలో పాల్గొనడానికి బొమ్మై హైదరాబాద్‌కు వస్తారని తెలిసి ఈ ఫ్లెక్సీలు వెలిశాయి. ఆదివారం బెంగళూరులో బొమ్మై మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి సంఘటనలతో రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు అస్తవ్యస్తంగా మారతాయని హెచ్చరించారు.

తెలంగాణలో జరుగుతున్న అవినీతిని కర్ణాటకలో ప్రస్తావిస్తే ఎలా ఉంటుందని తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావును ప్రశ్నించారు. ఇదొక పథకం ప్రకా రం చేసిన కుట్ర, ఇలాంటి వాటితో రెండు రాష్ట్రాల మధ్య రాజకీయ సంబంధాలు నాశనమ వుతాయని, ఎవరూ కూడా ఇలా చేయరాదని సూచించారు.

ఒక రాష్ట్రంపై ఆధార రహిత ఆరోపణలను చేయటం సరికాదన్నారు. తెలంగాణలో జరుగుతున్న పరిణామాలపై తాము ఫ్లెక్సీ వేస్తే ఎలా ఉంటుందని బొమ్మై ప్రశ్నించారు. కాగా, కర్ణాటకలో అన్ని పనుల్లో మంత్రులు 40 శాతం కమీషన్లు తీసుకుంటున్నారని కాంగ్రెస్‌ ఆరోపించడం తెలిసిందే.

చదవండి: (మార్గదర్శికేసులో రామోజీకి సుప్రీంకోర్టు నోటీసులు)

మరిన్ని వార్తలు