కరోనా: కోలుకున్నా ఇళ్లకు వెళ్లని రోగులు.. సీఎం ఆగ్రహం

12 May, 2021 10:59 IST|Sakshi

శివాజీనగర: కరోనా నుంచి కోలుకున్నా ఇళ్లకు వెళ్లకుండా కరోనా బాధితులు ఆస్పత్రుల్లోనే ఉంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఇళ్లకు వెళ్లిపోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా పలువురు రోగుల తీరుపై సీఎం యడియూరప్ప అసంతృప్తి వ్యక్తం చేశారు. కర్నాటకలోని శివాజీనగరలో మంగళవారం కోవిడ్‌ వార్‌ రూమ్‌లను సీఎం తనిఖీ చేశారు.

సుమారు 503 మంది 20 రోజులు ఆస్పత్రుల్లో ఉండి కోలుకున్నారు. అయితే వారంతా డిశ్చార్జ్‌ అయ్యే ఆలోచనలో లేనట్లు తెలుస్తోందన్నారు. బెడ్ల కొరత ఉండడంతో కోలుకున్న వెంటనే ఆసుపత్రి నుంచి వెళ్లిపోవాలని ఈ సంద్భంగా ముఖ్యమంత్రి యడియూరప్ప సూచించారు. టీకాలు వచ్చిన తక్షణమే అందరికీ వేయిస్తామని, గందరగోళం సృష్టించరాదని విజ్ఞప్తి చేశారు. వార్‌ రూంల సిబ్బంది సేవలు అభినందనీయమని ఈ సందర్భంగా కొనియాడారు.
 

చదవండి: రాష్ట్రాలకు నెట్టేసి నోరు మెదపని ప్రధాని మోదీ
చదవండి: ఆవు పేడతో కరోనా అస్సలు తగ్గదు.. వేరే సమస్యలు వస్తాయి

మరిన్ని వార్తలు