డీకే శివకుమార్‌కు సీబీఐ సమన్లు

22 Nov, 2020 06:39 IST|Sakshi

బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్‌ అధ్యక్షుడు డీకే శివకుమార్‌కు శనివారం సీబీఐ సమన్లు పంపింది. లెక్కల్లో చూపని ఆస్తుల కేసులో సీబీఐ ఈ సమన్లు పంపింది. ఈ నెల 25న శివకుమార్‌ సీబీఐ ముందు హాజరుకానున్నారు.   23న తమ ముందు హాజరుకమ్మని సీబీఐ కోరిందని, కానీ తనకు వేరే కార్యక్రమం ఉన్నందున 25న హాజరవుతానని తెలిపారు. కర్ణాటకలోని మస్కి, బసవకళ్యాణ నియోజకవర్గాల్లో త్వరలో ఉప ఎన్నికలను ప్రకటించే అవకాశాలున్నాయి. అందుకే ఈ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ నేతలు పర్యటించనున్నారు.  గతనెల 5న శివకుమార్‌తో పాటు పలువురికి చెందిన నివాసాలపై సీబీఐ సోదాలు నిర్వహించింది. సోదాల్లో రూ.57లక్షల నగదు, పలు డాక్యుమెంట్లు, లభించినట్లు సీబీఐ తెలిపింది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా