19 ఏళ్ల తర్వాత.. చనిపోయిన వ్యక్తి.. మళ్లీ ప్రాణాలతో..

11 May, 2022 08:18 IST|Sakshi
కురిసిద్ద నాయకున్ని తరలిస్తున్న దృశ్యం

మైసూరు: చామరాజనగర జిల్లాలోని కొళ్ళెగాల తాలూకా పాళ్య గ్రామంలో 19 ఏళ్ల తరువాత సీగేమారమ్మ జాతరలో బలి పండుగ నిర్వహించారు. ఇందులో ఒక భక్తుడు చనిపోయి 9 గంటల తరువాత మళ్లీ ప్రాణాలతో తిరిగి వస్తాడు. ఇందులో వాస్తవం ఎంతన్నది కాకుండా నమ్మకంతో ఆచరిస్తారు.  

ఇలా జరిగింది 
ఐదుమంది భక్తులు ఆలయంలో పూజలు చేసి బావిలో నుంచి రాగి తొట్టెలో నీటిని నింపుకొని వస్తారు. ఆ సమయంలో అమ్మవారి ఊరేగింపు వారికి ఎదురుగా వస్తుంది. కురిసిద్ద నాయకుడు అనే వ్యక్తి పైన అర్చకులు మంత్రాలు చదివి పూలు చల్లి అతని ఎదపైన కాలుతో తొక్కడంతో అతని ఊపిరి ఆగిపోతుంది. దీనినే బలి అంటారు. అతడు అచేతంగా 9 గంటలపాటు అలాగే ఉంటాడు. తరువాత కురిసిద్ద నాయకుడు ప్రాణాలతో లేవడంతో భక్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ బలి తంతును 19 ఏళ్ల తరువాత నిర్వహించినట్లు చెప్పారు.


మరో ఘటనలో..
వ్యక్తి దారుణ హత్య
తుమకూరు: తోట నుంచి ఇంటికి బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు అడ్డుకుని హత్య చేసిన ఘటన తుమకూరు జిల్లా గుబ్బి తాలూకా కరిశెట్టిహళ్లి గ్రామంలో  చోటు చేసుకుంది. హతుడిని కరిశెట్టిహళ్లి గ్రామానికి చెందిన మూడ్లయ్య(42)గా గుర్తించారు. మూడ్లయ్య సోమవారం అర్ధరాత్రి కరిశెట్టిహళ్లికి వెళ్తున్న సమయంలో దుండగులు అడ్డుకుని హత్య చేశారు. గుబ్బి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

చదవండి: ‘నాన్న క్షమించు.. నాకు బతకడం ఇష్టం లేదు’

మరిన్ని వార్తలు