నగరంలో కుక్కల రచ్చ.. అసెంబ్లీలో స్ట్రాంగ్‌ చర్చ

16 Mar, 2022 14:42 IST|Sakshi

శివాజీనగర(బెంగళూరు): బెంగళూరులో పెరుగుతున్న వీధి కుక్కల దాడులపై విధానసభలో మంగళవారం ఘాటుగా చర్చ జరిగింది. ప్రశ్నోత్తరాల సమ­యంలో బసవనగుడి ఎమ్మెల్యే రవి సుబ్రమణ్య ఈ అంశాన్ని ప్రస్తావించారు.  నగరంలో కుక్కల బెడద అధికమైంది. ప్రజలు తిరిగేందుకు భయపడుతున్నారని, ప్రభుత్వం ఏదో ఒకటి చేయాలని ఆయన కోరారు.

మంత్రి జేసీ మాధు­స్వామి మాట్లాడుతూ వీధి కుక్కల నియంత్రణకు జనన నియంత్రణ శస్త్రచికిత్సల చేయడానికి టెండర్లను పిలిచినట్లు చెప్పారు. వాటికి వ్యాధి నిరోధక టీకాలను కూడా వేయాలన్నారు. కుక్కలను చంపడానికి చట్టంలో అవకాశం లేదన్నారు.

మరిన్ని వార్తలు