పునాది కోసం తవ్వుతుండగా.. బయటపడ్డ భూగర్భ కట్టడం.. ఏముంది అందులో!

6 Jul, 2022 15:08 IST|Sakshi

దొడ్డబళ్లాపురం: రామనగర పట్టణ పరిధిలోని రైల్వేస్టేషన్‌ రోడ్డులో పునాది కోసం తవ్వుతుండగా పురాతన కట్టడం వెలుగు చూసింది.న వాజ్‌ అహ్మద్‌ అనే వ్యక్తి తన స్థలంలో దుకాణం నిర్మించడానికి పునాది కోసం పాయ తీయిస్తుండగా కట్టడం బయటపడింది. నాణ్యతతో నిర్మించబడిన ఆ కట్టడం వందల ఏళ్ల నాటిదని తెలుస్తోంది. క్రమంగా మట్టిలో మూసుకుపోవడంతో భూగర్భంలో కలిసిపోయి ఎవరి కంటా పడలేదు.

ఇది టిప్పుసుల్తాన్‌ కాలంలో నిర్మించబడిందని స్థానిక చరిత్రకారులు చెప్పారు. కట్టడం రూపురేఖలు చూస్తుంటే ఆయుధాగారం మాదిరిగా ఉందని, శ్రీరంగపట్టణంలోనూ ఇలాంటి కట్టడాలే ఉన్నాయని తెలిపారు. నేలమాళిగ నిర్మించి ఇందులో ఆయుధాల తయారీ, నిల్వ చేసేవారని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు