కర్ణాటక మాజీ స్పీకర్‌ కృష్ణ కన్నుమూత 

22 May, 2021 11:12 IST|Sakshi

సాక్షి, మైసూరు: కర్ణాటక విధానసభ మాజీ స్పీకర్‌ కేఆర్‌పేట కృష్ణ(80) శుక్రవారం కన్నుమూశారు. మైసూరులోని కువెంపునగరలో ఉన్న తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.  ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. 2006–2008 మధ్యకాలంలో ఆయన స్పీకర్‌గా పనిచేశారు. మూడు సార్లు కేఆర్‌ పేట నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1988లో ఎస్‌ఆర్‌ బొమ్మాయ్‌ మంత్రివర్గంలో పశుసంవర్ధక శాఖ, 1996లో మండ్య ఎంపీగా పనిచేశారు. 

కరోనాతో కేంద్ర మాజీ మంత్రి..
కేంద్ర మాజీ మంత్రి, కర్ణాటకకు చెందిన రైతు నేత బాబాగౌడ పాటిల్‌(78) కన్నుమూశారు. కొన్ని రోజుల క్రితం కరోనాకు గురైన ఈయన బెళగావిలోని ఆస్పత్రిలో శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. బెళగావి తాలూకా చిక్కబాగేవాడి గ్రామానికి చెందిన బాబాగౌడ...జేడీఎస్‌ తరఫున బాగల్‌కోటె జిల్లా నవలగుంది ఎమ్మెల్యేగా గెలిచి సేవలు అందించారు. బీజేపీలో చేరి 1998లో బెళగావి నుంచి ఎంపీగా గెలిచి వాజ్‌పేయి సర్కార్‌లో కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రిగా పని చేశారు.
చదవండి: దేశంలో కొత్తగా 2,57,299 కరోనా కేసులు

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు