Karnataka: ఆ ప్రాంతం మరో గోవా కానుంది..

22 Nov, 2021 14:44 IST|Sakshi

గోవా తరహా పర్యాటకానికి యోచన

సాక్షి, బెంగళూరు: గోవా అంటేనే ఎన్నో బీచ్‌లు, బార్లు, విలాసాల క్రూయిజ్‌ షిప్పులు, క్లబ్‌లతో పాటు దేశ విదేశీ పర్యాటకులు గుర్తుకు వస్తారు. గోవాను ఆనుకునే ఉన్న ఉత్తర కన్నడ జిల్లాను కూడా అదేరీతిలో అభివృద్ధి చేయాలని సర్కారు భావిస్తోంది. గోవా బీచ్‌లను చూసేందుకు కొందరు వస్తే మరికొందరు అక్కడ జరిగే క్యాసినోలో జూదమాడడానికి వస్తున్నారు. క్యాసినోల వల్ల గోవాకు ఏటా సుమారు రూ. 696 కోట్ల ఆదాయం వస్తోంది.

వాటిలో 3 వేల మంది అక్కడ జీవనోపాధి పొందుతున్నారు. అంతేకాకుండా క్యాసినో కోసం వచ్చే పర్యాటకుల వల్ల క్యాబ్స్, ట్యాక్సీ, హోటళ్లు, లాడ్జీలకు ఆదాయం వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రైవేటు భాగస్వామ్యంతో గోవా తరహాలో ఉత్తర కన్నడలోనూ పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఉత్తర కన్నడ భౌగోళికంగా ఎన్నో వైవిధ్యాలను కలిగిన జిల్లా. ఒకవైపు విశాలమైన తీర ప్రాంతం, మరోవైపు పశ్చిమ కనుమలు ఉన్నాయి.

మరిన్ని వార్తలు