ఏసీబీ అంటే అవినీతి కూపం.. హైకోర్టు న్యాయమూర్తికి బదిలీ బెదిరింపులు

6 Jul, 2022 11:41 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అనేది కలెక్షన్‌ సెంటర్‌గా మారిందని, అదో అవినీతి కూపమైందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ హెచ్‌పీ సందేశ్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇలా ఆరోపించడం వల్ల తనకు బదిలీ బెదిరింపులు వచ్చినట్లు చెప్పారు. ప్రజా శ్రేయస్సు, న్యాయం కోసం బదిలీ బెదరింపును ఎదుర్కోవడానికి సిద్ధమన్నారు. 2021 మేలో రూ.5 లక్షల లంచంతీసుకుంటూ అరెస్టయిన బెంగళూరు అర్బన్‌ కలెక్టరేట్‌లోని డిప్యూటీ తహశీల్దార్‌ పీ.ఎస్‌.మహేశ్‌ సమర్పించిన బెయిల్‌ పిటిషన్‌ విచారణ సమయంలో జస్టిస్‌ హెచ్‌.పీ.సందేశ్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

‘ఏసీబీలో అక్రమాలను ప్రశ్నించినందుకు నాకు బదిలీ బెదిరింపు వచ్చాయి. గతంలో కూడా ఓ న్యాయమూర్తి ఇలా బదిలీ అయ్యారు. నాకు ఎవరైనా భయం లేదు. పిల్లికి గంట కట్టేందుకు సిద్ధంగా ఉన్నాను. జడ్జి అయిన తరువాత  ఒక్క పైసా కూడా లంచం తీసుకోలేదు. ఉద్యోగం పోయినా పర్వాలేదు. నేను రైతు కొడుకును. ఎలా జీవించాలో నాకు తెలుసు. 50 రూపాయలతో బతకగలను. అలాగే రూ.50 వేలతోనూ జీవించడం తెలుసు. నేను ఏ రాజకీయ పార్టీకి చెందినవాడిని కాదు. రాజ్యాంగానికి మాత్రం కట్టుబడి ఉంటాను. ఏ పార్టీకి లొంగను’ అని స్పష్టం చేశారు.  
చదవండి: కేటీఆర్‌ సెటైర్‌, దేశ ప్రజలకు మోదీ అందించిన బహుమతి ఇదే!

జడ్జి లకే భద్రత లేదు 
ఎస్‌ఐ నియామక అక్రమాలకు సంబంధించి ఏడీజీపీ అరెస్ట్‌ అయినే నేపథ్యంలో హోంశాఖ మంత్రి అరగ జ్ఞానేంద్రను సస్పెండ్‌ చేయాలని, సీఎం బసవరాజ బొమ్మై రాజీనామా చేయాలని సీఎల్పీ నేత సిద్దరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీ.కే.శివకుమార్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం కేపీసీసీ కార్యాలయంలో వారిద్దరూ మీడియాతో మాట్లాడారు. కొన్ని విషయాల్లో రాష్ట్ర పాలనా యంత్రాంగానికి కళంకం వచ్చిందని, న్యాయ వ్యవస్థకు భద్రత లేని పరిస్థితి ఉద్భవించిందన్నారు. సోమవారం ప్రభుత్వ అధికారులు ఇద్దరు అరెస్ట్‌ అయ్యారు. అధికారి అరెస్ట్‌ అయిన అర్ధ గంటలో ఆరోగ్య పరీక్షలకు పంపించారు. అంత త్వరగా విచారణ పూర్తి చేసింది ఎందుకు? అని అన్నారు. కుంభకోణానికి బాధ్యత వహించి సీఎం, హోంమంత్రి తప్పుకోవాలన్నారు.  

యడ్డి కొడుకుపై ఆరోపణలు 
మాజీ సీఎం యడ్యూరప్ప కుమారుడు విజయేంద్ర, మంత్రి అశ్వత్థ్‌ నారాయణ పీఎస్‌ఐ అక్రమ నియామకాల్లో  ప్రమేయముందని, వీరిని సీఎం కాపాడుతున్నారని ఆరోపించారు. ఇక హైకోర్టు న్యాయమూర్తిని బెదరించారని, బదిలీ చేస్తామని భయపెట్టారని, న్యాయమూర్తికే భద్రత లేకుండా పోయిందని ఆరోపించారు. ఏసీబీ కలెక్షన్‌ బ్యూరో అయిందని విమర్శించారు. 

మరిన్ని వార్తలు