దుబాయ్‌ గ్యాంగ్‌తో చంపేస్తాం..! కర్ణాటక హైకోర్టు జడ్జిలకు బెదిరింపులు

24 Jul, 2023 19:12 IST|Sakshi

బెంగళూరు: గుర్తు తెలియని వ్యక్లి నుంచి కర్ణాటక హైకోర్టు జడ్జీలకు బెదిరింపులు అందాయి. హైకోర్టులోని ఓ ఉద్యోగితోపాటు పలువురు న్యాయమూర్తులను చంపేస్తామని ఓ పలు నెంబర్ల నుంచి వాట్సాప్‌ మెసెజ్‌లు వచ్చాయి. దీనిపై హైకోర్టు ప్రెస్‌ రిలేషన్స్‌ అధికారి(పీఆర్‌ఓ) కే మురళీధరన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా జూలై 12న రాత్రి 7 గంటలకు ఇంటర్నేషనల్‌ నెంబర్‌ నుంచి మురళీ ధరన్‌ వాట్సాప్‌కు మెసెజ్‌ వచ్చిన్నట్లు పోలీసులు తెలిపారు. 

హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్‌ భాషల్లో వచ్చిన ఈ మెసెజ్‌లో తనతోపాటు హైకోర్టులోని ఆరుగురు జడ్జిలను చంపేస్తామని బెదిరించినట్లు పేర్కొన్నారు. ఆరుగురు న్యాయమూర్తుల్లో జస్టిస్ మహ్మద్ నవాజ్, జస్టిస్ హెచ్‌టి నరేంద్ర ప్రసాద్, జస్టిస్ అశోక్ జి నిజగన్నవర్ (రిటైర్డ్), జస్టిస్ హెచ్‌పి సందేశ్, జస్టిస్ కె నటరాజన్, జస్టిస్ బి వీరప్ప (రిటైర్డ్) ఉన్నారు. కాగా బెదిరింపులు వచ్చిన నెంబర్‌ను మురళీధరన్‌కు హైకోర్టు అధికారికంగా అందించిందని తెలిపారు.

పాకిస్థాన్‌లోని బ్యాంకు ఖాతాకు ₹ 50 లక్షలు చెల్లించాలని లేదంటే.. ఈ లిస్ట్‌లో పేర్కొన్న వారిని దుబాయ్‌ గ్యాంగ్‌ ద్వారా చంపేస్తామని బెదిరించినట్లు పోలీసులు పేర్కొన్నారు.  ఈ మెసెజ్‌లో  ఐదు అనుమానాస్పద మొబైల్ ఫోన్ నంబర్లు కూడా ఉన్నాయని చెప్పారు. మురళీధరన్‌ ఫిర్యాదు ఆధారంగా ఐపీసీ సెక్షన్లు 506, 507, 504, ఐటీ చట్టంలోని 75, 66(ఎఫ్) సెక్షన్ల కింద సెంట్రల్ CEN పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
చదవండి: ఫేస్బుక్ ప్రియుడి కోసం పాకిస్థాన్‌కు .. నన్ను సీమాతో పోల్చకండి!

మరిన్ని వార్తలు