రాసలీలల వీడియో: మంత్రి రాజీనామా

3 Mar, 2021 14:28 IST|Sakshi
రమేశ్‌ జర్కిహోలి(ఫైల్‌ ఫోటో)

నైతిక కారణల వల్ల రాజీనామా చేస్తున్నాను

నిర్దోషిగా బయటకు వస్తాను: ఎంపీ

బెంగళూరు: కర్ణాటక జలవనరుల శాఖ మంత్రి రమేశ్‌ జార్కిహోలి ఓ యువతితో రాసలీలలు జరుపుతోన్న వీడియో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రమేష్‌ రాజీనామా చేయాలని.. అతడిపై చర్య తీసుకోవాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి. ఇక వీడియోలు లీకైనప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిన రమేష్‌ తాజాగా దీనిపై స్పందించారు. అది ఫేక్‌ వీడియో అన్నారు. కానీ నైతిక కారణాల దృష్ట్యా తాను రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. 

"నాపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవం. ఈ విషయంలో స్పష్టమైన దర్యాప్తు అవసరం. అది ఫేక్‌ వీడియో.. నేను నిర్దోషిగా బయటకు వస్తానని నాకు నమ్మకం ఉంది. నేను నైతిక కారణాల వల్ల రాజీనామా చేస్తున్నాను.. దీనిని ఆమోదించాల్సిందిగా కోరుతున్నాను" అని రమేశ్‌ తన రాజీనామ లేఖలో పేర్కొన్నారు‌‌.

ఈ అంశంపై బీజేపీ కూడా స్పందించింది. ఈ విషయాన్ని పూర్తిగా దర్యాప్తు  చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. యువతి డాక్యుమెంటరీ విషయమై కొద్ది రోజుల కిందట మంత్రి రమేశ్ వద్దకు వచ్చింది. ఈ క్రమంలో మంత్రి ఆమెను లోబచర్చుకున్నట్లు తెలిసింది. ఇందుకు సంబంధించిన వీడియో, ఆడియో సీడీలను  పౌరహక్కుల పోరాట సమితి అధ్యక్షుడు దినేశ్‌ కల్లహళ్లి బెంగళూరు నగర పోలీసు కమిషనర్‌ కమల్‌పంత్‌కు అందజేసిన సంగతి తెలిసిందే.

చదవండి: మంత్రి రాసలీలల వీడియోలు వైరల్‌

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు