ఛీ ఛీ.. అసెంబ్లీలో ఇదేం పాడుపని!

30 Jan, 2021 08:53 IST|Sakshi

బెంగళూరు: చట్టాలు రూపొందించే చట్ట సభ. ప్రజాస్వామానికి మూలస్తంభం.. ప్రజా సమస్యలపై చర్చించే వేదిక అసెంబ్లీ. అలాంటి అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాట్లాడకుండా ఓ ప్రజాప్రతినిధి అశ్లీల వీడియోలు చూస్తూ ఎంజాయ్‌ చేశారు. ఈ దృశ్యాలు బహిర్గతమవడంతో ఆయనపై ప్రజలతో పాటు నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చర్చలు చేయకుండా పాడుపని ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు కోరుతున్నాయి.

కర్నాటక అసెంబ్లీలో బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో శుక్రవారం శాసనమండలిలో చర్చ జరుగుతుండగా ఎమ్మెల్సీ ప్రకాశ్‌ రాథోడ్‌ సెల్‌ఫోన్‌లో అశ్లీల వెబ్‌సైట్‌లో వీడియోలు చూస్తూ తెగ ఎంజాయ్‌ చేశాడు. అయితే ఈ వార్తలను ఆయన ఖండించారు. తాను ఆ వీడియోలు చూడలేదని ప్రకాశ్‌ రాథోడ్‌ చెప్పారు. తాను గ్రామీణాభివృద్ధిపై మంత్రితో మాట్లాడుతున్నానని.. దానికి సంబంధించిన ప్రశ్నల కోసం సెల్‌ఫోన్‌లో వెతుకుతున్నానని వివరణ ఇచ్చారు. సెల్‌ఫోన్‌లో డేటా నిండిపోవడంతో కొన్ని డిలీట్‌ చేస్తున్నట్లు రాథోడ్‌ తెలిపారు. రాథోడ్‌ చేసిన పనిని బీజేపీ తప్పుపట్టింది. వెంటనే అతడిని సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేసింది.

అయితే కర్నాటకలో అసెంబ్లీ అశ్లీల వీడియోలు చూడడం కొత్తేం కాదు. 2012లో బీజేపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు పోర్న్‌ వీడియోలు చూస్తూ దొరికిపోయారు. ప్రస్తుతం ఆ ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఒకరు ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉండడం గమనార్హం.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు